Asianet News TeluguAsianet News Telugu

'జామియా' ఓ మినీ-ఇండియా.. దేశ నిర్మాణానికి విద్యార్థులందరూ సహకరించాలి: జామియా వైస్ ఛాన్సలర్   

జామియా జాతీయ విశ్వవిద్యాలయం. దేశ పౌరులందరికీ ఈ యూనివర్సిటీ తలుపులు తెరిచే ఉంటాయి. జామియాలో ముస్లిం విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండటంతో ఇతర విద్యార్థులు ప్రయోజనం పొందలేకపోతున్నారని అనడం సరికాదని జామియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్ అంటున్నారు. 

Prof Najma Akhtar says Jamia Millia Islamia is like a mini-India  KRJ
Author
First Published May 5, 2023, 5:08 PM IST

జామియా మిలియా ఇస్లామియా మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్, జామియాలోని విద్యార్థులందరూ దేశ నిర్మాణంలో సహకరించాలని కోరుతున్నారు. విద్య,సాహిత్యానికి చేసిన విశేష కృషికి గాను ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. రెండవ తరం విద్యావేత్త అయిన ప్రొఫెసర్ నజ్మా అక్తర్ 2019లో జామియా మిలియా ఇస్లామియా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అత్యున్నత స్థానాన్ని(వీసీ) అధిరోహించిన మొదటి మహిళగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. జామియా తన విద్యార్థులందరూ దేశభక్తితో దేశ నిర్మాణానికి  కృషి చేయాలని ఆమె కోరుకుంటున్నారు. 

ఆవాజ్ ది వాయిస్ తో ప్రొఫెసర్ నజ్మా అక్తర్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యను పొందేందుకు సమాజంలోని అన్ని వర్గాల బాలికలు చాలా కష్టపడుతున్నారని అంగీకరించారు. జామియావిశ్వవిద్యాలయం చాలా మంచి విద్యా వాతావరణం, క్రమశిక్షణ, హాస్టల్ సౌకర్యాలను కలిగి ఉంది.అందువల్ల ముస్లిం కుటుంబాలు తన పిల్లలను ఇక్కడి పంపడానికి ఇష్టాపడుతారు. ఆడపిల్లలను ఇక్కడ చదివించేందుకు తల్లిదండ్రులకు ఎలాంటి భయం లేదని గర్వంగా తెలిపారు. వారు చేయాల్సిందల్లా యూనివర్సిటీలో సీటు కైవసం చేసుకోవడమే. బాలికలు,మైనారిటీల కోసం ఇక్కడ చాలా హాస్టళ్లు ఉన్నాయి. వారు  స్కాలర్‌షిప్ పొందుతారన్నారు. 

ప్రొఫెసర్ నజ్మా అక్తర్ నాయకత్వం వహిస్తున్న జామియాకు NAAC A-ప్లస్ గుర్తింపు లభించింది. ఈ ఘతన సాధించడంలో నజ్మా అక్తర్ ఎంతగానో కృషి చేసింది.  అలాగే.. NIRF ర్యాంకింగ్‌లో జామియాకు 3వ ర్యాంక్‌ సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (UK), QS ర్యాంకింగ్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో జామియా 600-800 మధ్య ర్యాంక్ పొందింది. ప్రొఫెసర్ నజ్మా అక్తర్ దూరదృష్టి వల్లే పేరు వచ్చిందని అంటారు. కానీ ఆమె మాత్రం సహకార జట్టుకృషితో జామియా ప్రతిష్టను మరింత పెంచమని అంటారు.  

భారతదేశంలోని ప్రధాన ముస్లిం సంస్థలలో జామియా ఒకటని,ముస్లిం సమాజ పురోగతిని నిర్ధారించడంలో జామియా ఎలా దోహదపడుతుందని అడిగినప్పుడు ప్రొఫెసర్ నజ్మా అక్తర్ ఇలా సమాధానమిచ్చారు. “ఇది జాతీయ విశ్వవిద్యాలయం ,భారతదేశ పౌరులందరికీ దాని తలుపులు తెరిచి ఉన్నాయి. జామియా చుట్టుపక్కల ఉంటే.. చాలా మంది ముస్లింలు ఈ విశ్వవిద్యాలయానికి ఆకర్షితులయ్యారు. కాబట్టి, ఇక్కడ ముస్లిం విద్యార్థుల సంఖ్య ఎక్కువ. కానీ, ఇతర విద్యార్థులకు అందుబాటులో లేదనడంతో అర్థం లేదు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ఇది మైనారిటీ సంస్థ. కాబట్టి, మేము ముస్లిం విద్యార్థులకు కూడా కొంత రిజర్వేషన్లు కలిగి ఉన్నామని అంటున్నారు  ప్రొఫెసర్ నజ్మా అక్తర్. 
 
ఆమె జామియా యూనివర్సిటీ గురించి ఇంకా మాట్లాడుతూ.. జామియా మిని భారత్ అంటారు. భారతదేశ ఔన్నత్యం ఇక్కడ తెలుసుకోవచ్చని అంటారు. ఇక్కడ దేశం నలుమూలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు,పరిశోధకులను చూడవచ్చు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి. తద్వారా భారతదేశంలోని ప్రతి మారు మూల నుండి విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే అవకాశం పొందుతారని తెలిపారు. 

ఇక ప్రొఫెసర్ నజ్మా అక్తర్ కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. ఐదేళ్ల కాలానికి జామియా యూనివర్సిటీ 
వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆమె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA)లో పనిచేశారు. ఆమెను మీరు జామియా బ్రాండ్ అంబాసిటర్ గా పేరు పొందారంటే.. ఆమె నవ్వుతుంది. జమియాకు అపారమైన సామర్థ్యం ఉందని, సవాళ్లను స్వీకరించి విజయం సాధించాలని ఆమె విశ్వసిస్తోంది.

అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం జామియాలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే ప్రశ్నకు ప్రొఫెసర్ సమాధానమిస్తూ.. జామియా జనాదరణ పొందిన యూనివర్సిటే కాదు. ఇక్కడ ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయని  అన్నారు.  పేద విద్యార్థులను ఆకర్షించడానికి తాము అనేక కొత్త ఉద్యోగ-ఆధారిత కోర్సులను ప్రారంభించామనీ,  ఇది స్టార్టప్‌లను ప్రారంభించేందుకు వారికి శక్తినిస్తుందని పేర్కొన్నారు. జామియాలో పలు విదేశీ భాషలను కూడా నేర్పుతున్నామని, అలాగే..  లా, ఇంజనీరింగ్ కాకుండా సంస్కృతం, అనేక 

భారతీయ భాషలను కూడా అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని రేకెత్తించడానికి తాము అనేక రకాల కోర్సులను అందిస్తున్నాం అన్నారు. మా యూనివర్శిటీ నుండి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి దేశ నిర్మాణానికి సహకరించేలా, మంచి పౌరుడిగా,  దేశానికి విధేయుడిగా ఉండేలా మేము కృషి చేస్తాము. మా పరిశోధన అంశాలు చాలా సందర్భోచితమైనవి. దేశ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేయబడ్డాయని వివరించారు.

జామియా పరిశోధనా రంగంలోనూ విశేష కృషి చేసిందని, ఎంతో మంది విద్యార్థులు ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ అందుకున్నారని తెలిపారు. వాస్తవానికి, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో జామియాకు చెందిన పలువురు పరిశోధకులు ఉన్నారని పేర్కొన్నారు. 

క్యాంపస్‌ వాతావరణాన్ని దేశవ్యతిరేక శక్తులు చెడగొట్టకుండా ఉండేలా యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించగా.. మా అకడమిక్ సెషన్ పూర్తి స్వింగ్‌లో ఉంది. అడ్మిషన్లు, పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే ఎలాంటి గొడవలు జరిగినా సహించబోం. ఏ రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి ప్రతినిధి అయినా ఇక్కడికి వచ్చి మా క్యాంపస్‌లో వాతావరణాన్ని చెడగొట్టినట్లయితే..వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉంది. మేము అందరినీ సమానంగా చూస్తామని బదులిచ్చారు. 

జామియా యూనివర్సిటీ సంప్రదాయం, విలువలను ఎలా కాపాడుతున్నారని ప్రశ్నించగా...జామియా యూనివర్సిటీకి దేశంలో చాలా ప్రత్యేక స్థానముంది. ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వ సొమ్ముతో స్థాపించబడలేదు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన వారిచే ఈ విద్యాసంస్థను స్థాపించారు. స్వాతంత్య్రం వచ్చేనాటికే జామియా విద్యా వ్యాప్తికి చాలా తోడ్పాటును అందించింది. అదే..ఈ యూనివర్సిటీ 
సంప్రదాయాలు,విలువలను సజీవంగా ఉంచాలి. మా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, మా వ్యవస్థాపకుల వారసత్వాన్ని గుర్తుచేసుకుంటాము. కొత్త వారు విశ్వవిద్యాలయంలో చేరడం లేదని, స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన కృషి చేసిన వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయమని గుర్తు చేస్తున్నాము. మేము ఆర్కైవ్‌ల ద్వారా ఈ విశ్వవిద్యాలయ చరిత్రను గుర్తించే మ్యూజియాన్ని ఏర్పాటు చేసాం అని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్ తెలిపారు.

ఒక మహిళా నాయకురాలిగా, విద్యా సంబంధ నాయకత్వంలో ఉన్న బాలికలను మరియు మహిళలను ఆమె ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించగా.. ఈ రోజుల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులు. నా తరానికి చెందిన వారికి లేదా తరువాతి తరానికి కూడా ఎదగడం అంత సులభం కాదు. విద్యార్థులకు, మహిళలకు మార్గనిర్దేశం చేయడం, ప్రోత్సహించడం నా కర్తవ్యం, తాము ఎవరికీ తక్కువ కాదని, ముందుకు సాగాలన్నారు. మా ఛాన్సలర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా, నా ప్రో-వైస్ ఛాన్సలర్ తస్లీమ్, నా ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ బాత్రా దాదాపు సగం మంది డీన్‌లు మహిళలే. ఈ పదవులన్నింటిలోనూ మహిళలు ఉండి.. మహిళలను ప్రోత్సహించకపోతే ఎలా? అని తిరిగి ప్రశ్నించారు. 

2021 సివిల్ సర్వీసెస్ టాపర్ శ్రుతి శర్మ జామియా చెందిన ప్రఖ్యాత రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA)లో కోచింగ్ పొందిందని, ఇది సివిల్ సర్వీసెస్ ఆశించేవారికి ఉచిత కోచింగ్‌ను అందజేస్తుందని తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది. యూనివర్శిటీకి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆ కోచింగ్ ను SC,ST,మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం రూపొందించాం. ప్రారంభమైనప్పటి నుండి  600 మందికి పైగా విద్యార్థులు సివిల్ సర్వీసెస్,ఇతర సెంట్రల్, స్టేట్ సర్వీసెస్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని గౌరవంగా తెలిపారు.  
   
ప్రొఫెసర్ నజ్మా ఇంకా మాట్లాడుతూ.. తాను జామియా తొలి మహిళా వైస్ ఛాన్సలర్‌గా ఎంపిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ, ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క మహిళా వైస్ ఛాన్సలర్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ఎన్నిక కాలేదని గుర్తు చేశారు. ఏ వ్యక్తి నిజాయితీగా పనిచేస్తాడో, వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.  వైస్ ఛాన్సలర్ కావడానికి తరగతి గదిలో బోధించడం మాత్రమే కాదు.  పరిపాలనా అనుభవం కూడా అవసరమని అంటారు. 

ఇక ప్రొఫెసర్ నజ్మా జీవిత విశేషాలకు వస్తే..

ఆమె తన పాఠశాల విద్యను అలహాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్‌లో పూర్తి చేశారు. ఆమె తండ్రి హెచ్‌హెచ్ ఉస్మానీ విద్యావేత్త. ప్రొఫెసర్ నజ్మా మొదటి సంతానం కావడంతో ఆమె తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేది. ఆమె  తల్లిదండ్రులు, తోబుట్టువులు నజ్మా చదువు కోసం నిరంతరం ప్రోత్సహించారు. ఆమె తన విద్యాభాసం గురించి  ఇలా అన్నారు. “నేను నా జీవితమంతా స్కాలర్‌షిప్‌పై చదువుకున్నాను. నాకు మొదటి నేషనల్ సైన్స్ టాలెంట్ స్కాలర్‌షిప్. తరువాత కామన్వెల్త్ ఫెలోషిప్ వచ్చింది. బోటనీలో బీఎస్సీ, ఎంఎస్సీ చేశాను. ఆ తర్వాత సాహిత్యంలో మాస్టర్స్ చేశారు. ఆమె దివంగత భర్త ప్రొఫెసర్ అక్తర్ మజీద్ హమ్దార్ద్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఫెడరల్ స్టడీస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు.ఆమె కుమారుడు ఢిల్లీలోని మల్టీ నేషనల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా ఉండగా, కుమార్తె అమెరికాలో ఇంజినీర్‌. ఆమె 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios