ఎన్నిక‌ల త‌ర్వాత ఇండియా కూట‌మి ముక్క‌ల‌వుతుంది.. రాహుల్ గాంధీకి మోడీ కౌంటర్

Narendra Modi vs Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన‌ ఘాటు వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప్ర‌తిప‌క్షాల ఇండియా కూట‌మి ముక్క‌ల‌వుతుంద‌నీ, యువరాజు విదేశాలకు వెళతారంటూ కౌంట‌రిచ్చారు.
 

Indias alliance will fall into pieces after the elections.. PM Narendra Modi's counter to Rahul Gandhi RMA

Lok Sabha Elections 2024 : సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. రాహుల్ గాంధీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలు సైతం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల దాడులు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ చేసిన ఘాటు వ్యాఖ్య‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందిస్తూ లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇండియా కూట‌మి ముక్క‌ల‌వుతుంద‌నీ, యువ‌రాజు విదేశాల‌కు వెళ్లిపోతాడ‌ని కౌంట‌రిచ్చారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 7 దశల్లో పోలింగ్ జ‌రుగుతోంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా, ఐదో దశ పోలింగ్ 20న జరగనుంది. జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగిసిన త‌ర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు కూడా అదే రోజున వెలువ‌డ‌నున్నాయి. 

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా చేస్తున్న నాయ‌కులు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లతో రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌ధాని కౌంట‌రిచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. జూన్ 4న జరిగే ఎన్నికల్లో ఓడిపోయిన త‌ర్వాత‌ ఈ యువరాజులు ఎలాంటి మొహమాటం లేకుండా విదేశాలకు వెళతారంటూ కౌంట‌రిచ్చాడు.

ర‌స‌వ‌త్త‌రంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జ‌ట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌లను టార్గెట్ చేస్తూ "ఎస్పీ, కాంగ్రెస్‌ యువరాజులకు దేశాభివృద్ధి అంటే ఆ ప్రాంతంలోని పిల్లలు గిల్లీ దందా ఆడుతున్నట్లే.. ఈ యువరాజులు రాజభవనాలలో పుట్టడంతో కష్టపడి పనిచేయడం గానీ, ఫలితాలు రావడం గానీ అలవాటు లేదు అందుకే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందంటూ కామెంట్లు చేస్తున్నార‌ని" విమ‌ర్శించాడు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ అమేథీ నుంచి వెళ్లారు, రాయ్‌బరేలీ నుంచి కూడా వెళ్తారంటూ కౌంట‌రిచ్చారు.

అలాగే, "బంగారు చెంచాల‌తో పుట్టిన పిల్లలకు దేశాన్ని నడపడం ఆట కాదు. మీరు చేయలేరు. జూన్ 4 తర్వాత కచ్చితంగా మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే అంతే కాదు ఇంకా చాలా జరగబోతోంది. ఏం జరుగుతుందో నేను చెప్పాలా? జూన్ 4వ తేదీ తర్వాత, ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుంది.. నాక్-నాక్..  ఓటమి తరువాత ఎవ‌రిని బలిపశువును చేయాలా? అని వెతుకుతారంటూ" ప్ర‌ధాని మోడీ విమ‌ర్శించాడు.

 

 

టీమిండియా ప్రధాన కోచ్ రేసులో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు.. అప్పుడే ర‌చ్చ మొద‌లైంది ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios