- Home
- Entertainment
- కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా
కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా
ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది.

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది.
ఈ ఎపిసోడ్ కి ఒక ప్రత్యేకత ఉంది. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ కి అతిథిగా హాజరయ్యారు. కాజల్ లాంటి బ్యూటీ అతిథిగా రావడంతో హైపర్ ఆది చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
కాజల్ వేదికపైకి మగధీర చిత్రంలోని ధీర ధీర అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న వారంతా కాజల్ కి ఘనస్వాగతం పలికారు. కాజల్ రాగానే హైపర్ ఆది ఆమెని ఇంప్రెస్ చేసే విధంగా ఫ్లటింగ్ మొదలు పెట్టాడు. మీ పెళ్లి రోజు అక్టోబర్ 30 కదా అని హైపర్ ఆది కాజల్ అని అడిగాడు. కాజల్ అవునని సమాధానం ఇచ్చింది. ఆ రోజు నా డెడ్ డేట్ అంటూ హైపర్ ఆది ఫన్నీగా చెప్పాడు.
పెళ్ళికి ముందు నీమీద ఎన్నో కవితలు రాసుకున్నా అని తెలిపాడు.. మరి పెళ్లి తర్వాత అని కాజల్ అడిగింది.. పెళ్లి తర్వాత కిచ్లు బాధితుడిగా మారాను అంటూ ఆమె భర్తపై సెటైర్ వేశాడు.
ఆ తర్వాత కాజల్ అగర్వాల్ శేఖర్ మాస్టర్ తో కలసి బాద్షా చిత్రంలోని పాటకి డ్యాన్స్ చేసింది. ఇద్దరూ ఎంతో అందంగా వేదికపై డ్యాన్స్ తో అలరించారు. తన డ్యాన్స్ మూమెంట్స్ తో తనలో ఇంకా గ్రేస్ తగ్గలేదని కాజల్ నిరూపించింది.
చివర్లో హైపర్ ఆది, కాజల్ ఇద్దరూ ఫ్యాన్స్ కి భలే సర్ప్రైజ్ ఇచ్చారు. హైపర్ ఆది, కాజల్ కలసి మగధీరలోని పంచదార బొమ్మ సాంగ్ పాడారు. కాజల్ ని ముట్టుకోవడానికి హైపర్ ఆది ప్రయత్నిస్తూ.. గాలి నిన్ను తాకింది, నేలకూడా తాకింది నేను నిన్ను తాకితే తప్పా అని పాడాడు. కాజల్ అద్భుతంగా పాడుతూ హైపర్ ఆది పరువు తీసింది. గాలి ఊపిరయ్యింది..నేల నన్ను నడిపింది ఏమిటంటే నీలోని గొప్పా అంటూ క్యూట్ గా పాడింది. ఈ ఎపిసోడ్ మే 22న టెలికాస్ట్ కానుంది.