Asianet News TeluguAsianet News Telugu

Cyber Crime: పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మెగా మోసం.. రూ. 54 లక్షలు పోగొట్టుకున్న మహిళ..!

Cyber Crime: దేశంలో ఆన్‌లైన్ మోసాలు సర్వసాధారణమైపోతున్నాయి. అత్యంత సాధారణ స్కామ్‌లలో ఒకటిగా మారిపోయింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని భావించిన మహిళ రూ. 54 లక్షలు పోగొట్టుకుంది. 

Mumbai Women Banker Scammed In Online Task Based Part Time Job Here Is The Details KRJ
Author
First Published May 17, 2024, 8:20 AM IST

Cyber Crime: దేశంలో ఆన్‌లైన్ మోసాలు సర్వసాధారణమైపోతున్నాయి. అత్యంత సాధారణ స్కామ్‌లలో ఒకటిగా మారిపోయింది. ఇందులో ఒక టాస్క్ ఇచ్చి దానికి భారీ మొత్తం చెల్లించమని, అలా చెల్లిస్తే.. అంతకు మించి సంపాదించవచ్చని ఆశచూపుతారు. తాజా ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళ ఈ మోసానికి బలైపోయింది. నివేదిక ప్రకారం.. సైబర్ దుండగులు ఆన్‌లైన్ టాస్క్‌లు ఇస్తానని ఓ మహిళా బ్యాంకర్‌ను రూ.54 లక్షలు మోసం చేశారు. ఈ వ్యవహారం అంతా ముంబైలోని ఐరోలీకి చెందినది. బాధిత మహిళ మలాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. ఆ మహిళ చాలా కాలంగా పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ సమయంలో ఆమె ఈ సైబర్ ఉచ్చులో పడింది.

పోలీసుల కథనం ప్రకారం.. మే 7న మహిళకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. మెసేజర్ తనను తాను ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ రేటింగ్ , రెస్టారెంట్‌ను సమీక్షించే పనిని బ్యాంకర్ మహిళను కోరింది. రెస్టారెంట్‌ను సమీక్షించినందుకు అతనికి రూ.1,000 వరకు లభిస్తుందని పేర్కొన్నారు. మహిళను ఒప్పించేందుకు డెమో టాస్క్ ఇచ్చి ఆమె ఖాతాకు రూ.200 పంపించారు.
 
ఆ తర్వాత ఆ మహిళను ఒప్పించారు. దీని తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ను మహిళకు పంపారు. భద్రత పేరుతో రూ.1,000 డిపాజిట్ చేయమని అడిగారు. దీంతో ఆ మహిళకు రూ.1500 తిరిగి వచ్చింది. దీని తర్వాత మహిళ 11 సార్లు సుమారు రూ.54 లక్షల 30 వేలు పెట్టుబడి పెట్టింది. మహిళ ఈ డబ్బును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా, మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని కోరింది. అప్పుడు మహిళా బ్యాంకర్ తాను మోసపోయానని గ్రహించింది. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ తప్పు చేయవద్దు

మీరు కూడా అలాంటి మెసెజ్ లు వస్తే.. వెంటనే వాటిని బ్లాక్ చేయండి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ఆశపడకండి. ప్రారంభంలో డబ్బు వచ్చినా ట్రాప్‌లో పడకండి. ఎందుకంటే చేపకు ట్రాప్ చేసే ముందు ఎర పెట్టినట్టు మిమ్ములను కూడా అలానే ట్రాప్ చేస్తారు. ఏదైనా మోసం జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios