Asianet News TeluguAsianet News Telugu

పార్టీలలో కమల్ డ్రగ్స్ తీసుకునేవారా?, పాత ఫొటో వైరల్

. ప్రముఖ డ్రగ్‌డీలర్‌ జాఫర్ సాదిక్‌తో కలిసి కమల్ హాసన్  దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా ..

Suchitra Accuses Kamal Haasan Of Serving Cocaine At His Parties jsp
Author
First Published May 17, 2024, 10:11 AM IST


తమిళ చిత్ర పరిశ్రమలో   కొకైన్ స‌ర‌ఫ‌రా వార్త  పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం నెలకొని ఉండటంతో వ ైరల్ అవుతోంది.  సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్ చేశాడు. 

ఇక మొదట తన మాజీ భర్త కార్తీక్ కుమార్ కొకైన్ వాడుతున్నాడని, తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ సర్వసాధారణమని సుచిత్ర ఆరోపించింది. కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఒకరినొకరు మోసం చేసుకున్నారని సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇందులో కమల్‌పై ప్రస్తావన కూడా ఉంది. సుచిత్ర ఇంటర్వ్యూ తమిళ చిత్ర సీమలో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. 

 సుచిత్ర చేసిన కామెంట్స్ తర్వాత కమల్‌ హాసన్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. ప్రముఖ డ్రగ్‌డీలర్‌ జాఫర్ సాదిక్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలపై జాఫర్‌ను 2024 మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. అంతేకాదు.. జాఫర్ డీఎంకే పార్టీ మాజీ కార్యకర్త. అతను ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ డీలర్‌గా కొనసాగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

'సింగర్ సుచిత్ర ఇటీవల కమల్ హాసన్ తన పార్టీలలో కొకైన్ వాడుతున్నారని ఆరోపించారు. తమిళ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌లో చిక్కుకుంది`` అని నారాయ‌ణ‌న్ పేర్కొన్నారు. అయితే.. దీనిపై క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. మ‌రోవైపు.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కూడా ప‌లువురు క‌మ‌ల్ పై ఫిర్యాదులు చేశారు. అయితే. క‌మ‌ల్‌పై ఆరోప‌ణలు ఇప్పుడు కొత్త‌కాదు. 2015లో కూడా.. ఆయ‌న డ్ర‌గ్స్ తీసుకుంటున్నా ర‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, కంప్లైంట్స్  కూడా వ‌చ్చాయి. ఎవరూ దీన్ని సీరియస్ గా పట్టించుకోలేదు. రూమర్ గానే కొట్టిపారేసారు.  కానీ ఇప్పుడు  నారాయ‌ణ‌న్ తిరుప తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం వెనుక‌.. రీజ‌నేంట‌నేది ఆస‌క్తిగా మారింది.
 
క‌మ‌ల్ హాస‌న్ తిరుప‌తిలోని అట‌వీ ప్రాంతంలో కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కొకైన్ స‌ర‌ఫ‌రా చేశార‌నే వార్త‌లు అప్ప‌ట్లోనే కోలీవుడ్‌ను కుదిపేశాయి. అయితే.. ఆ త‌ర్వాత అంతా చ‌ల్లారిపోయింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా నారాయ‌ణన్ ఫిర్యాదు చేయ‌డం, సింగ‌ర్ సుచిత్ర కూడా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios