ఐస్ క్యూబ్స్ ను ఈ ఇంటి పనుల కోసం కూడా ఉపయోగించొచ్చు తెలుసా?
ఫ్రిజ్ లో ఉండే ఐస్ క్యూబ్ ను మనమందరం నీళ్లను చల్లగా ఉంచడానికి, జ్యూస్ ను తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ వీటిని ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించ్చు. అదెలాగంటే?
సమ్మర్ సీజన్ లో ఆడవాళ్లు ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఐస్ క్యూబ్స్ ను వాడుతుంటారు. ఐస్ క్యూబ్ ను కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం మాత్రమే కాకుండా.. నొప్పిని, వాపును తగ్గించుకోవడానికి వీటిని ఒక గుడ్డలో కట్టి కంప్రెస్ చేస్తుంటారు. అయితే వీటిని ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. వీటితో పాటుగా బట్టలు ఉతుక్కునే సమయంలో ఐస్ క్యూబ్స్ ను వాషింగ్ మెషీన్ లో వేయొచ్చు.
ఐస్ క్యూబ్ తో ఇంటిని శుభ్రం చేయడం ఎలా?
ఎండాకాలం ప్రారంభం కాగానే అందరం వాటర్ బాటిల్ ను ఫ్రిజ్ లో పెట్టి ఐస్ ట్రేలో నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ అయ్యేలా చేస్తాం. ఐస్ క్యూబ్స్ ను సిరప్, కూల్ డ్రింక్స్ లో వేయడంతో పాటుగా నీళ్లను చల్లగా ఉంచడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇంటిని శుభ్రం చేయడానికి కూడా మీరు ఐస్ క్యూబ్ ను కూడా ఉపయోగించొచ్చు.
ఫెవికాల్ మరకలు
వస్తువులను అతికించేటప్పుడు ఫెవికాల్ బట్టలు, నేలపై పడుతుంటుంది. కానీ ఈ మరకలు మొండిగా ఉంటాయి. అయితే మీరు ఐస్ క్యూబ్స్ ను ఉపయోగించి మీరు ఫెవికాల్ మరకలను పోగొట్టొచ్చు. దీని కోసం ఐస్ క్యూబ్ ముక్కను ఆ ప్రదేశంలో 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. ఐస్ కరిగిన తర్వాత గుడ్డ సాయంతో తుడిస్తే శుభ్రం అవుతుంది.
కార్పెట్ పై మరకలను తొలగించడానికి..
కార్పెట్ పై మరకలను పోగొట్టడానికి కూడా ఐస్ క్యూబ్ ను ఉపయోగించొచ్చు. ఇది ఆరిన తర్వాత కార్పెట్ కు అంటిన మరకలు పోవడం చాలా కష్టమే. ఈ మరకలను నిమిషాల్లో శుభ్రం చేయడానికి మీరు ఐస్ క్యూబ్స్ ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా ఐస్ క్యూబ్స్ వేసి వదిలేయండి. ఐస్ కరిగిన తర్వాత క్లాత్ సాయంతో తుడవండి.
ఫర్నీచర్ గుర్తులను తొలగించడానికి..
ఫర్నిచర్ పై క్లాత్ లేదా కార్పెట్ ను వేస్తాం. దీంతో దాని దిగువ భాగం దెబ్బతినకుండా ఉంటుంది. అయితే ఫర్నిచర్ ను ఎక్కువ సేపు ఒకే చోట ఉంచడం వల్ల కార్పెట్ పై గుర్తులు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి మీరు ఐస్ క్యూబ్స్ ఉపయోగించొచ్చు. దీని కోసం ఒక ఐస్ క్యూబ్ ముక్కను ఉంచి అది పూర్తిగా కరిగేవరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గుడ్డ సాయంతో రుద్ది శుభ్రం చేయండి.
వాషింగ్ మెషీన్ లో ఐస్ క్యూబ్స్
వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతుక్కుంటే 4-5 ఐస్ క్యూబ్స్ ను వేయండి. ఇలా చేయడం వల్ల బట్టలను డ్రైయర్ లో పెట్టుకుంటే ముడతలు రావు.