అకాల వ‌ర్షాలు.. పిడుగుపాటుతో 3 చిన్నారులు స‌హా 11 మంది మృతి

lightning strikes : పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటుకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 

Untimely rains.. 11 people including 3 children died due to lightning in Bengal's Malda RMA

11 killed in lightning: అకాల వ‌ర్షాలు ప్రాణాల‌ను తీసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై గురువారం మధ్యాహ్నం ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వ‌నున్న‌ట్టు ప్రకటించింది. "ఇప్పటివరకు పిడుగుపాటుతో 11 మంది చనిపోయారు. గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది" అని ఒక అధికారి తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.

మాల్దాలోని సహపూర్ ప్రాంతంలో చందన్ సహాని (40), రాజ్ మృద్ధా (16), మనజిత్ మండల్ (21) అనే ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుతో మ‌ర‌ణించాడు. అలాగే, అసిత్ సాహా (19) అనే వ్యక్తి గజోల్‌లో మామిడి తోట‌లో పనిచేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురై మరణించాడు. మానిక్‌చక్‌లోని మహ్మద్ తోలాలో ఎనిమిదేళ్ల రాణాతో పాటు హరిశ్చంద్రపూర్‌కు చెందిన నయన్ రాయ్ (23), ప్రియాంక సింఘా (20) దంపతులు కూడా పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారని అధికారి తెలిపారు. హద్దటోలాలో పిడుగుపాటుకు అతుల్ మండల్ (65), షేక్ సబ్రుల్ (11) మృతి చెందగా, మిర్దాద్‌పూర్‌లో సుమిత్ర మండల్ (45) ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంగ్లీషుబజార్‌లోని మిల్కీలో పంకజ్ మండల్ (23) అనే వ్యక్తి పిడుగుప‌డి మ‌ర‌ణించాడు.

 

 

ఇదిలావుండ‌గా, మే 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రెండ‌వ వారం ప్రారంభంలో ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా అది అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.  వారం చివరి భాగంలో ఈ వ్యవస్థ మరింత తీవ్రమై ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

SRH VS GT : భారీ వ‌ర్షం.. హైదరాబాద్ VS గుజ‌రాత్ మ్యాచ్ పై హెచ్సీఏ కీలక ప్రకటన

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios