జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు నితీశ్. 

జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు కీలక పదవిని కట్టబెట్టారు నితీశ్. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించారు.

హోదా రీత్యా నితీశ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన పదవిగా జేడీయూ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటారు. ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిశోర్ నియామకాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మీడియాకు తెలిపారు.

పోల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ 2014లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అత్యథిక స్థానాలు కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత బిహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల తరపున వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం తాను ఇకపై ఏ పార్టీ తరపునా పనిచేయనని ప్రకటించి..నితీశ్ కుమార్ సమక్షంలో జేడీయూలో చేరారు. 

రాజకీయనేతగా మారిన వ్యూహకర్త.. జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్

పార్టీలకు షాక్.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను: ప్రశాంత్ కిశోర్

కేసిఆర్ వ్యూహకర్త కూడా ప్రశాంత్ కిశోరే: స్టాలిన్ కు కూడా..

కాంగ్రెస్ , వైసిపి రాజీ పనిలో ప్రశాంత్ కిశోర్

ప్రశాంత్ పై జగన్ కు అంత నమ్మకమా?

ప్రశాంత్ ను నేతలకు పరిచయం చేసిన జగన్