Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్ పై జగన్ కు అంత నమ్మకమా?

వారం క్రితమే పార్టీలోని కీలకనేతలందరికీ పరిచయం చేసారు.  తాజాగా ప్రశాంత్ ను ప్లీనరీ వేదికగా వైసీపీ శ్రేణులకే కాకుండా రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసారు. ప్రశాంత్ ను జగన్ అంత ధైర్యంగా పరిచయం చేస్తున్నారంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో వ్యూహకర్తపై ఎంతటి నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతోంది.

Jagan introduces prasant kishor to the cadre in the plenary

వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునే విషయంలో వైఎస్ జగన్ పూర్తి నమ్మకంతో ఉన్నట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటంలో భాగంగా జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, చాలా కాలం వరకూ ఆ విషయాన్ని జగన్ గోప్యంగానే ఉంచారు. ఇటీవలే అంటే, ఓ వారం రోజుల క్రితం మాత్రమే ప్రశాంత్ ను అధ్యక్షుడు జిల్లాల అధ్యక్షులు, సీనియర్ నేతలకు పరిచయం చేసారు. దాంతో అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఎందుకంటే, వైసీపీలోని చాలామంది నేతలు ప్రశాంత్-జగన్ ఒప్పందం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు.

అటువంటిది జగనే స్వయంగా ప్రశాంత్ ను పరిచయటం చేసేటప్పటికి ఆశ్చర్యపోయారు. అటువంటిది ఆదివారం ప్లీనరీ సందర్భంగా వైసీపీ అధినేత ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా నేతలు, శ్రేణులకు వేదికనుండి పరిచయం చేసారు. అంతేకాకుండా తాను ప్రశాంత్ సేవలను ఉపయోగించుకుంటున్న కారణాలను కూడా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యూహకర్త సేవలను ఉపయోగించుకున్న తీరును వివరించారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఏ విధంగా లాభపడిందీ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో ప్రశాంత్ సేవలందించినప్పటికీ కాంగ్రెస్ దెబ్బతిన్న కారణాలను వివరించారు.

కాబట్టి తాము కూడా వచ్చే ఎన్నికలకు ప్రశాంత్ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. అవసరమైన అన్ని సూచనలు, సలహాలను ప్రశాంత్ అందిస్తారంటూ జగన్ చెప్పటం విశేషం. మామూలుగా అయితే, వ్యూహకర్తలు తెరవెనుకే ఉంటారు. పార్టీల అధినేతలు వ్యూహకర్తలను పార్టీలోని నేతలందరికీ కూడా పరిచయం చేయరు.

అయితే అందుకు జగన్ భిన్నంగా వ్యవహరించారు. పార్టీలోని కీలకనేతలందరికీ పరిచయటం చేయటమే కాకుండా ప్రశాంత్ ను ప్లీనరీ వేదికగా వైసీపీ శ్రేణులకే కాకుండా రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసారు. ప్రశాంత్ ను జగన్ అంత ధైర్యంగా పరిచయం చేస్తున్నారంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో వ్యూహకర్తపై ఎంతటి నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios