Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్ ను నేతలకు పరిచయం చేసిన జగన్

అందరూ ఆశ్చర్యపోయేట్లుగా జగన్ ఈరోజు ప్రశాంత్ ప్రత్యేకంగా నేతలకు పరిచయం చేసారు. 8, 9 తేదీల్లో గుంటూరు రోడ్డులో జరుగనున్న పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించేందుకు జగన్ సీనియర్ నేతలు, జిల్లాల అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రశాంత్ ను జగన్ అందరికీ పరిచయం చేసారు.

Jagan introduces prasant kishore to the leaders

మొట్టమొదటిసారిగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ను నేతలకు పరిచయం చేసారు. ప్రశాంత్ కిషోర్ అంటే ప్రత్యేకించి పరిచయటం అవసరం లేని పేరు ప్రస్తుత రాజకీయాల్లో. పోయిన సాధారణ ఎన్నికల్లో నరేంద్రమోడి ప్రధానమంత్రి అవటానికి ఎన్నికల  వ్యూహకర్త ప్రశాంతే కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవి అందుకోవటంలో కూడా ప్రశాంతే కీలక పాత్ర పోషించారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ ను జగన్ వైసీపీ తరపున రంగంలోకి దింపారు ఏపిలో.

సుమారు ఆరుమాసాలుగా ప్రశాంత్ తన పనిని తాను చేసుకుపోతున్నారు. ఇప్పటికే తన బృందంతో మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ పరిస్ధితేంటన్న విషయంపై నిశితంగా అధ్యయనం చేసారు. వైసీపీ పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూనే అధికార టిడిపి విషయంలో కూడా జనాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. దాంతో ఇరు పార్టీలపైనా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలేంటన్నది జగన్ కు అందిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో జగన్ పాత్ర ఎంత ప్రముఖంగా ఉండబోతోందో తెరవెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా అంతే ముఖ్యం.

అటువంటి ప్రశాంత్ ఇప్పటి వరకూ పార్టీ నేతలతో సంబంధాలు లేకుండా తనకు అప్పగించిన పనిని తాను చేసుకుపోతున్నారు. అటువంటిది అందరూ ఆశ్చర్యపోయేట్లుగా జగన్ ఈరోజు ప్రశాంత్ ప్రత్యేకంగా నేతలకు పరిచయం చేసారు. 8, 9 తేదీల్లో గుంటూరు రోడ్డులో జరుగనున్న పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించేందుకు జగన్ సీనియర్ నేతలు, జిల్లాల అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రశాంత్ ను జగన్ అందరికీ పరిచయటం చేసారు. దాంతో ఇప్పటివరకూ తెరవెనుకకు మాత్రమే పరిమితమైన ప్రశాంత్ బహుశా ఇక నుండి తెరమీద కూడా కనిపిస్తారోమో?

Follow Us:
Download App:
  • android
  • ios