Asianet News TeluguAsianet News Telugu

పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు.. మైన‌ర్ ను రేప్ చేసి.. వ్యభిచార రొంపిలోకి నెట్టిన 21 మందికి జైలు శిక్ష..

చెన్నై పోక్సో కోర్టు( ప్ర‌త్యేక కోర్టు) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మైన‌ర్ బాలికపై అత్యాచారం చేసి వ్యభిచార రొంపిలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది వ్యక్తులకు సోమవారం పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించగా, పోలీసు ఇన్‌స్పెక్టర్, బీజేపీ కార్యకర్త, జర్నలిస్టు సహా 13 మందికి ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  

POCSO Court Sentenced Eight People To Life Imprisonment Raping And Pushing A Teenage Girl Into Prostitution
Author
First Published Sep 27, 2022, 12:27 AM IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులు.. ర‌క్ష‌ణ‌గా నిలువ‌ల్సిన  ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ .. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన ఓ నాయ‌కుడు.. నిజాల‌ను నిర్భయంగా ప్ర‌జ‌ల‌కు ముందుకు తీసుక‌రావాల్సిన ఓ జ‌ర్న‌లిస్టు ఇలా.. ప‌లువురు ఆ చిన్నారిని చిదిమేశారు. అభం శుభం తెలియని మైన‌ర్ పై లైంగిక దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ చిన్నారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశారు. ప్ర‌త్యేక్ష నరకం చూపించారు.

ఈ అత్యంత అమానుష ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ కేసులో చెన్నైలోని పోక్సో కోర్టు( ప్రత్యేక కోర్టు ) సోమవారం సంచ‌ల‌న తీర్పు వెలువరించింది. ఇలాంటి త‌ప్పు మ‌రోసారి స‌మాజంలో జ‌ర‌గ‌కుండా.. ప్ర‌ధాన నిందితుల‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వివరాలోకెళ్తే.. టీనేజర్‌పై అత్యాచారం చేసి వ్యభిచారంలోకి నెట్టిన ఎనిమిది మందికి చెన్నైలోని పోక్సో కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. టీనేజర్‌పై అత్యాచారం చేసి వ్యభిచారంలోకి దింపిన కేసులో పోలీస్ ఇన్‌స్పెక్టర్, బీజేపీ నాయకుడు, జర్నలిస్టు సహా 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

పోక్సో చట్టం కింద నమోదైన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 15న ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఆ తర్వాత ఇప్పుడు అందరికీ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఎం.రాజలక్ష్మి ప్రభుత్వాన్ని ఆదేశించారు. 21 మందిపై విధించిన జరిమానా మొత్తం సుమారు ₹ 2 లక్షలు కూడా ఆమెకు ఇవ్వాలని న్యాయమూర్తి తెలిపారు

 యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారిలో బాధితురాలి సవతి తండ్రి, సవతి తల్లి కూడా ఉన్నారు. 20 ఏళ్ల శిక్ష పడిన వారిలో ఎన్నూర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెండ్ చేయబడిన ఇన్‌స్పెక్టర్ సి పుగలేంధి, బిజెపి కార్యకర్త జి రాజేంద్రన్ మరియు ఒక ప్రైవేట్ మీడియా ఛానెల్‌లో పనిచేస్తున్న వినోబాజీ అనే జర్నలిస్టు ఉన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆల్ మహిళా పోలీసులు వాషర్‌మన్‌పేటలో 26 మందిపై కేసు నమోదు చేసి 2020 నవంబర్‌లో 560 పేజీలకు పైగా చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

100 మందికి పైగా అత్యాచారం  

26 మంది నిందితుల్లో నలుగురు పరారీ కాగా, కేసు విచారణ సమయంలో ఒకరు మరణించారు. మిగిలిన 21 మంది నిందితులపై కోర్టులో కేసు నడుస్తోంది. 13 ఏళ్ల వయసులో బాలికపై 100 మందికి పైగా అత్యాచారం చేసి బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఇందులో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్, రాజకీయ నాయకుడు, జర్నలిస్టు ప్రమేయం కూడా బయటపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios