MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • TTD: వెంక‌న్న భ‌క్తుల‌కు పండ‌గే.. ఇక‌పై ఉచిత బ‌స్సు ప్ర‌యాణం. టీటీడీ కీల‌క నిర్ణ‌యం

TTD: వెంక‌న్న భ‌క్తుల‌కు పండ‌గే.. ఇక‌పై ఉచిత బ‌స్సు ప్ర‌యాణం. టీటీడీ కీల‌క నిర్ణ‌యం

కలియుగ దైవం తిరుల‌మ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి నిత్యం వేలాది మంది భక్తులు వ‌స్తుంటారు. దేశ‌విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తుల కోసం టీటీడీ ఎన్నో ర‌కాల సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 22 2025, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉచిత ర‌వాణా స‌దుపాయం
Image Credit : our own

ఉచిత ర‌వాణా స‌దుపాయం

తిరుమలలో భక్తుల సౌక‌ర్యార్థం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరుగనున్నాయి. భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ బస్సుల్లో ఏ చార్జీ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ సేవలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారికంగా ప్రారంభించారు. ఇది తిరుమలలో భక్తులకు తిరగడానికి సులభతరం చేస్తుంది.

26
ప్రైవేటు వాహనాలకు చెక్
Image Credit : our own

ప్రైవేటు వాహనాలకు చెక్

తిరుమలలో గత కొంతకాలంగా ప్రైవేటు వాహనాలు భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. దాంతోపాటు ఈ వాహనాల వ‌ల్ల‌ వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతోంది. 

ఈ సమస్యల పరిష్కారంగా టీటీడీ, APSRTC ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీనివల్ల భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది.

Related Articles

Related image1
Iran: 16 ఏళ్ల యువ‌తిని బ‌హిరంగంగా ఉరి తీసిన ఇరాన్‌.. ఆ క‌ర్మ ఫ‌లిత‌మే ఈ వినాశ‌న‌మా.?
Related image2
RTC: ఇలా అయితే అంద‌రూ RTC బ‌స్సులే ఎక్కుతారు.. తెలంగాణ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం.
36
శ్రీ‌వారి ధర్మరథాల మాదిరిగా ఎప్పటికప్పుడు ట్రిప్పులు
Image Credit : our own

శ్రీ‌వారి ధర్మరథాల మాదిరిగా ఎప్పటికప్పుడు ట్రిప్పులు

ప్రస్తుతం తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ‌వారి ధర్మరథాల ద్వారా రోజుకు సుమారు 300 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఇప్పుడు APSRTC బస్సులు కూడా కలవడం వల్ల అదనంగా రోజూ 80 ట్రిప్పులు నడిపే అవకాశం ఏర్పడింది. ఈ బస్సులు ప్రతి రెండు నిమిషాలకు ఒకటి ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. తక్కువ గ్యాప్‌తో ఎక్కువ బస్సులు తిరగడం వల్ల భక్తుల రద్దీ సమస్య కొంత మేరకు తగ్గుతుంది.

46
తిరుపతి కనెక్షన్‌కి మరింత సౌలభ్యం
Image Credit : our own

తిరుపతి కనెక్షన్‌కి మరింత సౌలభ్యం

ఈ ఉచిత బస్సులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులను సజావుగా తిరుపతి చేరవేస్తాయి. భక్తులు ప్రత్యేకంగా బస్టాండ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాల నుంచే APSRTC బస్సుల్లో ఎక్కవచ్చు. తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కినా తిరుపతికి మాత్రమే చార్జీలు వసూలు చేస్తారు. తిరుమలలో బస్సుల ప్రయాణం పూర్తిగా ఉచితమే. అదనపు చార్జీలు లేవు అని టీటీడీ ప్రకటించింది.

56
తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ
Image Credit : our own

తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ

వీకెండ్ కావ‌డంతో తిరుమ‌ల భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శన క్యూలైన్లు శిలాతోరణం వరకూ విస్తరించాయి. ప్రస్తుతం ఉచిత దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) ద్వారా దర్శనానికి 7 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు సమయం అవసరం అవుతోంది.

66
శ‌నివారం ఎంత‌మంది ద‌ర్శించుకున్నారంటే
Image Credit : our own

శ‌నివారం ఎంత‌మంది ద‌ర్శించుకున్నారంటే

శ‌నివారం ఒకే రోజులో తిరుమలలో స్వామివారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 90,087 మందిగా నమోదు అయింది. అదే రోజు తలనీలాలు సమర్పించిన భక్తులు 41,891 మంది. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4.30 కోట్లు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Recommended image3
Now Playing
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Related Stories
Recommended image1
Iran: 16 ఏళ్ల యువ‌తిని బ‌హిరంగంగా ఉరి తీసిన ఇరాన్‌.. ఆ క‌ర్మ ఫ‌లిత‌మే ఈ వినాశ‌న‌మా.?
Recommended image2
RTC: ఇలా అయితే అంద‌రూ RTC బ‌స్సులే ఎక్కుతారు.. తెలంగాణ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved