Asianet News TeluguAsianet News Telugu

Drugs‌ ఉచ్చులో చిక్కుకున్న వారిని జైళ్లకు తరలించరు.. చట్టంలో మార్పులు చేసేందుకు సిద్దమైన కేంద్రం.. !

డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. సానుభూతి ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చట్టాల్లో మార్పుల చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 

People trapped in drugs will not be jailed government is preparing to change the law
Author
New Delhi, First Published Nov 28, 2021, 10:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశవ్యాప్తంగా డ్రగ్స్‌పై యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా చోట్ల పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం డ్రగ్స్‌ బారిన పడిన వారిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. సానుభూతి ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చట్టాల్లో మార్పుల చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు తమ సొంత అవసరాల కోసం పరిమిత మొత్తంలో డ్రగ్స్ లేదా మాదకద్రవ్యాలను కలిగి ఉంటే.. వారిపై నేరస్థుల మాదిరిగి కేసులు నమోదు చేయకుడదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి బదులు వారిని డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్‌కు (drug de-addiction centre) తరలించనున్నారు. 

డ్రగ్స్ లేదా డ్రగ్స్‌తో పట్టుబడిన వారిపై చేసిన చట్టంలో మార్పులకు సంబంధించి కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ముఖ్యమైన సూచనలు చేసింది. అయితే డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను నేరస్తులుగా చూడకుండా.. వారిని జన జీవితంలో సాధారణంగా ఉండేలా చేసేందుకు చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. నేరస్తులుగా చూడటం ద్వారా వారు మరింతగా డ్రగ్స్‌‌కు బానిసలుగా మారుతారని.. వారు ఈ చెడు వ్యసనాన్ని వదిలేలా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. 

అయితే డ్రగ్స్ వ్యాపారం చేసే వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని స్పష్టం చేస్తుంది. చట్టాన్ని మార్పలులు చేసేటప్పుడు.. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాపారంలో నిమగ్నమైన వారిని మరింత కఠినంగా శిక్షించాలని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తీసుకురావాలని పూర్తి యోచనలో ఉన్నట్లు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు చెబుతున్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 600 డి-అడిక్షన్ సెంటర్లు ఉన్నాయని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే చట్టంలో మార్పు వచ్చిన తర్వాత అవసరమైతే మరిన్ని కేంద్రాలను ప్రారంభించవచ్చనే యోచనలో ఉన్నట్టుగా పేర్కొంది. 

2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతుల చేపట్టినప్పటి నుంచి.. డ్రగ్స్‌పై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. డ్రగ్స్‌‌కు బానిసలుగా మారుతున్న వారిని ఈ వ్యసనం నుంచి బయటకు తీసుకురావడానికి డీ అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించారు. ఇక్కడ డ్రగ్స్ తీసుకునేవారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటుగా.. అందులో నుంచి బయటపడేందుకు చికిత్స అందించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios