Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఒక్కరోజులో 6 వేల NGOsల విదేశీ విరాళాలు కట్​!

FCRA registration expired: స్వచ్ఛంద సంస్థ(NGOs)లపై కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  దేశంలోని ఆరు వేల సంస్థల ఎఫ్ఆర్​సీఏ లైసెన్సుల‌పై వేటు వేసింది. దిల్లీ ఐఐటీ, జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మ్యూజియం లైసెన్సు ముగిసినట్లు ప్ర‌క‌టించింది.  స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు FCRA లైసెన్సు వీలు కల్పిస్తోంది.
 

Over 12,000 Indian NGOs, including Oxfam and Jamia, lose foreign funding licence in last 24 hours
Author
Hyderabad, First Published Jan 2, 2022, 5:27 AM IST

FCRA registration expired: స్వచ్ఛంద సంస్థ(NGOs)లపై కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఒకే రోజు దేశవ్యాప్తంగా  ఆరు వేలకు పైగా NGOs వేటు వేసింది.  NGOs ల‌  విదేశీ విరాళాల లైసెన్సులను (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం  (FCRA)  రద్దు చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. స్వచ్ఛంద సంస్థలు.. విదేశాల నుంచి  విరాళాలు పొందాలంటే.. FCRA లైసెన్స్ తప్పనిసరి. డిసెంబ‌ర్ 31, 2021 నాటితో 5933 స్వ‌చ్చంధ సంస్థల FCRA  లైసెన్సుల కాలపరిమితి ముగిసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అవి లైసెన్సు పునరుద్ధరణకు చేసుకున్న దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది.

శుక్రవారం వరకూ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద మొత్తంగా 22,762 నమోదై వుండగా, తాజాగా ఆరు వేలకు పైగా సంస్థలు లైసెన్సులు కోల్పోయాయి. దీంతో ప్రస్తుతం దేశంలో ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ వున్న NGOs సంఖ్య  16,829 కి చేరింది. వాటి లైసెన్సులను మార్చి 31వరకు లేదా రెన్యువల్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునేవరకు పునరుద్ధరించారు.  

2020 సెప్టెంబర్ 30 నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం 12,989 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 179 సంస్థల దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ వున్న ఎన్‌జిఓలు 16,829 మాత్రమే ఉన్నాయి. విదేశీ విరాళాలు అందుకోవాలంటే కచ్చితంగా ఈ సంస్థలు రిజిస్టరై (లైసెన్సు కలిగి) వుండాలి. 
 

Read Also: journalists: 2021లో 45 మంది జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌.. ప్ర‌మాదంలో పత్రికా స్వేచ్ఛ‌..

ఎఫ్‌సిఆర్‌ఎ సర్టిఫికెట్ల కాలపరిమితి ముగిసిన ఎన్‌జిఓ జాబితాలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, మదర్‌ థెరిస్సా మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమొరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా,  జామియా మిలియా ఇస్లామియా, ట్యుబర్‌క్యులాసిస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌, ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ లెప్రసీ మిషన్‌లతో సహా మొత్తంగా 12వేలకు పైగా ఎన్‌జిఓల లైసెన్సుల కాలపరిమితి ఇటీవల ముగిసింది. ఆ సంస్థలన్నీ శుక్రవారంతో లైసెన్సులు కోల్పోయాయి.  

Read Also: ఇజ్రాయెల్‌లో మరో వైరస్.. ఫ్లోరోనా కలవరం.. డబుల్ ఇన్ఫెక్షన్‌గా గుర్తింపు

 'ప్రతికూల స్పందన' వున్న కారణంగానే స్వ‌చ్చంధ సంస్థ‌ల‌ లైసెన్స్‌ను పునరుద్ధరించలేదని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మదర్‌ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ విదేశీ నిధుల లైసెన్స్‌ను పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అనాథ పిల్లలకు ఆశ్రమాలు, పాఠశాలలు, క్లినిక్‌లు, ధర్మశాలలు నడుపుతుందీ స్వచ్ఛంద సంస్థ. ఈ ప్రాజెక్టులన్నింటిని వేలాదిమంది నన్‌లు పర్యవేక్షిస్తుంటారు."ప్రతికూల స్పందనల" కారణంగా ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించలేదని భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఈ స్వచ్ఛంద సంస్థ తన కార్యక్రమాలను ఉపయోగిస్తోందని అతివాద హిందూ గ్రూపులు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది.

Read Also: దేశాభివృద్ధిని కరోనా అడ్డుకోలేదు.. సువర్ణాధ్యాయం లిఖించండి: ప్రధాని మోడీ న్యూ ఇయర్ మెసేజ్

కేంద్రం ఈ సంస్థ‌కు విదేశీ నిధులు అందకుండా లైసెన్స్ ర‌ద్దు చేయ‌డంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయినా, కేంద్ర హోం శాఖ సమర్థించుకోవడం గమనార్హం. అలాగే.. గుజరాత్‌లో చారిటీ సంస్థ నిర్వహించే ఒక బాలల హోమ్‌లో మతమార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసు ఫిర్యాదు నమోదైంది. దాంతో లైసెన్స్‌ను పునరుద్ధరించలేదు. తమ నిర్ణయాన్ని సమీక్షించాలని ఎలాంటి అభ్యర్థనలు కూడా రాలేదని హోం శాఖ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios