దేశాభివృద్ధిని కరోనా అడ్డుకోలేదు.. సువర్ణాధ్యాయం లిఖించండి: ప్రధాని మోడీ న్యూ ఇయర్ మెసేజ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరం ప్రవేశించిన తొలి రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గతేడాది దేశంలో అద్భుత సంస్కరణలు చేశామని, ఎన్నో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, అదే వేగాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని వివరించారు. ఈ ఏడాది దేశ అభివృద్ధిని కరోనా అడ్డుకోజాలదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: రెండేళ్లుగా కరోనా(Coronavirus) ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ప్రాణ నష్టంతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నది. కరోనా మహమ్మారితో దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ(Indian Economy) కూడా మందగించింది. మరోసారి ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కేసులు పెరుగుతుండటంతో దేశ ఆర్థఇక అభివృద్ధిపై నీలినీడలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నూతన సంవత్సరం(New Year)లో తొలిసారిగా పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ధైర్య విశ్వాసాలను నింపారు. దేశ అభివృద్ధి(Development)ని కరోనా మహమ్మారి అడ్డుకోజాలదని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పదో విడత నిధులు విడుదల చేస్తూ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కరోనాపై రాజీలేకుండా చేసిన పోరాటానికి నిదర్శంగా గడిచిన ఏడాది నిలిచిపోతుందని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాదు, ఆ కాలంలో అద్భుతమైన సంస్కరణలను తీసుకున్నామని గుర్తు చేశారు. అంతేకాదు, 145 కోట్ల టీకా డోసుల పంపిణీ సాధించడాన్ని గుర్తు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. కరోనాను దృఢంగా ఎదుర్కొందని వివరించారు. ఈ ఏడాది కూడా అదే తీరులో అప్రమత్తతో, జాగ్రత్తలతో ఈ మహమ్మారిని పోరాడాల్సి ఉన్నదని తెలిపారు. గతేడాది ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో భారత దేశం ఎన్నో కీలక మైలురాళ్లను సాధించిందని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసిన కేంద్రం..
గతేడాది అనేక రంగాల్లోనే కీలకమైన సంస్కరణలు చేశామని, ఎన్నో అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగలిగామని ప్రధాని తెలిపారు. అభివృద్ధిలో ఇదే వేగాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని వివరించారు. అయితే, ఇప్పుడు ఇంకా కరోనా ముప్పు పొంచి ఉన్నదని, కానీ, అది మన దేశ అభివృద్ధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 8శాతం వేగంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతేకాదు, ఈ మహమ్మారి కాలంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను దేశం ఆకర్షించిందని వివరించారు. జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదే ప్రసంగంలో ఆయన తన తాజా మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన క్లిప్‌ను ప్రస్తావించారు. అందులో ఆయన ప్రజలను గొప్పగా ఆలోచించాలని, కలలూ పెద్దగా ఉండాలని కోరారు. వాటిని సాధించడానికి, దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి పూనుకోవాలనీ సూచించారు. అంతేకాదు, నూతన భారత నిర్మాణంలో ఈ ఏడాది ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించాలని అన్నారు. మన కలలు కేవలం మనకే పరిమితం కాబోవని, మన కలలు దేశ అభివృద్ధి, సమాజ అభివృద్ధితో సంబంధంలో ఉండాలని తెలిపారు.
Also Read: Pupunjab election 2022: నాణ్యమైన విద్య.. అంబేద్కర్ కలను సాకారం చేస్తాం: కేజ్రీవాల్
దేశంలో ఇప్పటివరకు 1,431 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం తెలిపింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 488 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 351 Omicron casesతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.