Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయెల్‌లో మరో వైరస్.. ఫ్లోరోనా కలవరం.. డబుల్ ఇన్ఫెక్షన్‌గా గుర్తింపు

ఇజ్రాయెల్‌లో మరో భయంకర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలో కొత్త వైరస్ ఫ్లోరోనా రిపోర్ట్ అయింది. కొవిడ్-19, ఇన్‌ఫ్లుయెంజాల డబుల్ ఇన్ఫెక్షనే ఈ ఫ్లోరోనా అని అధికారులు వెల్లడించారు. అల్ అరబ్ న్యూస్ ఈ వార్తను గురువారం రిపోర్ట్ చేసింది.
 

first case of florona reported in israel
Author
New Delhi, First Published Jan 1, 2022, 2:22 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా(Coronavirus) కలవరం ఇంకా ముగియనేలేదు. డెల్టా(Delta Variant) చూపిన భయంకర క్షణాలు ఇంకా మరవక ముందే.. ఒమిక్రాన్(Omicron Variant) మరోసారి ప్రమాదక ఘంటికలు మోగిస్తున్నది. ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా రిపోర్ట్ కావడంతో అన్ని దేశాలూ ఆందోళనలో మునిగిపోయాయి. రెండు డోసుల టీకాలు పూర్తి చేసుకన్నా.. ఈ భయాలతో మూడో డోసు.. నాలుగో డోసులు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో మరో పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ రిపోర్ట్ అయింది. ఇది డబుల్ ఇన్ఫెక్షన్ అని అధికారులు చెప్పారు. దాన్ని ఫ్లోరోనా(Florona)గా పిలుస్తున్నారు. కొవిడ్-19(Covid-19), ఇన్‌ఫ్లుయెంజా(Influenza)ల డబుల్ ఇన్ఫెక్షనే(Double Infection) ఫ్లోరోనా అని అధికారులు చెప్పారు.

ఓ గర్భిణి ప్రసవించడానికి రాబిన్ మెడికల్ సెంటర్‌కు వెళ్లారు. ఆమెకు టెస్టులు చేయగా ఈ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు కొవిడ్-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా కూడా ఉన్నది. ఈ రెండింటి ఇన్ఫెక్షనే ఫ్లోరోనాగా అల్ అరేబియా అరబ్ న్యూస్ వెల్లడించింది. కాగా, కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మందగించిన వారికి మరో డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని  ఆ దేశ అధికారులు నిర్ణయించారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారికి నాలుగో డోసును శుక్రవారం నుంచి పంపిణీ చేయడం మొదలు పెట్టారు.ఇజ్రాయెల్‌లో మూడో డోసు వేసి నాలుగు నెలలు గడిచిపోయింది. ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం తగ్గిపోవడం లేదా.. కొందరిలో రోగ నిరోధక శక్తి కూడా కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. ఈ  నేపథ్యంలోనే రోగ నిరోధక శక్తి మందగించిన వారికి నాలుగో డోసు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్ట్రీ డైరెక్టర్ జనరల్ నాచమన్ ఆష్ వెల్లడించారు.

Also Read: Omicron in India: భారత్‌లో 1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు

అంతేకాదు, వయోవృద్ధులు నివసించే ఆశ్రమాల్లోనూ టీకా వేయడానికి అనుమతులు వచ్చినట్టు తెలిపారు. ఎందుకంటే.. వీరిలోనూ రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ముప్పు ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాబట్టి, వృద్ధులు నివసించే ఆశ్రమాల్లో వైరస్ విస్ఫోటనం చెందకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఈ దేశంలో కొత్తగా సుమారు ఐదు వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకున్న ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ వైరాలజిస్ట్ వైరాల‌జిస్ట్ గగన్‌దీప్ కాంగ్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. మున్ముందు మ‌రిన్ని కోవిడ్ -19 వేవ్స్ ఉంటాయ‌ని, వాటిని స్వీక‌రించేందు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. అవి ఇప్పుడు మ‌న జీవితంలో భాగ‌మ‌ని, వాటితో క‌లిసి జీవించాల్సిందే అని అన్నారు. “ మ‌నం SARS-CoV-2, దాని ఇత‌ర వేరియంట్లు వ‌స్తూనే ఉంటాయి. ఈ వేరియంట్ల‌తో క‌లిసి జీవించ‌డం నేర్చుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఈ ఒమిక్రాన్ ఇతర వేరియంట్‌ల కంటే చాలా తక్కువ తీవ్రతతో ఉంద‌ని తెలుస్తోంది’’ అని ఆమె ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.  సాధారణంగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు పిల్లలలో చాలా త‌క్కువ తీవ్ర‌తలో ఉంటోంద‌ని ఆమె అన్నారు. కాబ‌ట్టి పిల్ల‌ల‌ను స్కూళ్లకు, కాలేజీల‌కు పంపిస్తేనే బాగుంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం చాలా త‌క్కువ డేటా అందుబాటులో ఉన్నందు వ‌ల్ల ఇండియాలో ఏ వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసుగా ఇవ్వాల‌నే విష‌యాన్ని తాను సూచించ‌లేనని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios