దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  దీంతో.. తన కూతురిని లైంగికగా వేధిస్తున్నారని పోలీసు కేసు పెట్టాడు. తనపైనే కేసు పెడతాడా అని నిందితుడు.. బాధితురాలి, ఆమె తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. చివరకు బెయిల్ పై బయటకు వచ్చి మరీ.. బాధితురాలి తండ్రిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2018లో హత్రాస్ జిల్లాకు చెందిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి దళిత కుటుంబానికి చెందిన ఓ యువతిపై గౌరవ్ శర్మ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో... బాధితురాలి తండ్రి.. గౌరవ్ శర్మపై పోలీసు కేసు పెట్టాడు. నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష కూడా విధించింది. అయితే... ఒక నెల తర్వాత నిందితుడుు బెయిల్ మీద బయటకు వచ్చాడు.

అప్పటి నుంచి బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. కాగా.. తాజాగా.. నిందితుడు తన కుటుంబంతో స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లగా.. అక్కడికే బాధితురాలు కుటుంబం కూడా వచ్చింది. కాగా.. అక్కడ.. ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో.. నిందితుడు తుపాకీతో.. బాధితురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. 

తీవ్రగాయాలపాలైన అతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది.

తొలుత ఆ గౌరవ్ శర్మ పై తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. తర్వాత ఇప్పుడు తన తండ్రిని కాల్చి చంపాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా...  గతేడాది సెప్టెంబర్ లో ఇదే హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాధితురాలిపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. బాధితురాలు చాలా రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.