Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం మహిళల విడాకులపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు.. 

ముస్లిం మహిళల విడాకులపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. షరియత్ కౌన్సిల్‌లు కోర్టులు లేదా మధ్యవర్తులు కావు కాబట్టి అవి ఖులా కింద విడాకులను ధృవీకరించలేవని కోర్టు పేర్కొంది. షరియత్ కౌన్సిల్ యొక్క 'ఓపెన్' సర్టిఫికేట్‌ను రద్దు చేస్తూ జస్టిస్ సి శరవణన్ ఈ తీర్పు ఇచ్చారు.

Only Family Courts can issue Khula divorce certificates to Muslim women, Madras High Court rules
Author
First Published Feb 1, 2023, 3:15 AM IST

ముస్లిం మహిళల విడాకులపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 'ఖులా' (విడాకులు) కోరే ముస్లిం మహిళలు కేవలం కుటుంబ న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించాలని, జమాత్‌లోని కొంతమంది సభ్యులతో కూడిన షరియత్ పరిషత్‌ల వంటి ప్రైవేట్ సంస్థలను సంప్రదించకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే ఓపెన్ సర్టిఫికెట్లు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. తమిళనాడు తౌహీద్ జమాత్, చెన్నైలోని షరియా కౌన్సిల్ జారీ చేసిన ఖులా (విడాకుల) ధృవీకరణ పత్రాన్ని జస్టిస్ సి. శివరామన్‌తో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.  విడిపోయిన జంట తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఫ్యామిలీ కోర్టు లేదా తమిళనాడు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాలని ఆదేశించింది.    
                                                                                                                                                                                           2017లో షరియత్ కౌన్సిల్ నుంచి తన భార్య పొందిన ఖులా సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.  తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1975 కింద నమోదైన షరియత్ కౌన్సిల్‌కు అలాంటి సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం లేదని కూడా పిటిషనర్ వాదించారు. తాను 2017లో దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం పిటిషన్ దాఖలు చేశానని, ఎక్స్ పార్ట్ డిక్రీ కూడా పొందానని ఆమె కోర్టుకు తెలిపారు.

డిక్రీని అమలు చేయాలంటూ వేసిన పిటిషన్ అడిషనల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు పెండింగ్‌లో ఉందని తెలిపారు. కోర్టు పిటిషనర్ మరియు షరియత్ కౌన్సిల్‌ను విచారించింది, అయితే, పిటిషనర్ భార్య వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకాలేదు. కుటుంబ న్యాయస్థానాల చట్టం, 1984లోని సెక్షన్ 7(1)(బి) ప్రకారం, వివాహాన్ని రద్దు చేసే ఉత్తర్వును జారీ చేసే అధికారం న్యాయపరమైన ఫోరమ్‌కు మాత్రమే ఉందని న్యాయమూర్తి తెలిపారు. బాదర్ సయీద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017)లో మద్రాస్ హైకోర్టు ఖాసీలు ఓపెన్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధించిందని కూడా న్యాయమూర్తి శివరామన్ గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios