ఈ రాశుల వారు ఎంత పిసినారులో..!
కొంత మంది డబ్బును ఖర్చు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. డబ్బు లేనోళ్ల సంగతి పక్కన పెడితే డబ్బు ఉన్న కొంత మంది కూడా ఇలాగే చేస్తుంటారు. వీళ్లనే పిసినారులు అంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు అచ్చం ఇలాగే ఉంటారు. వాళ్లు ఎవరంటే?
కొంతమంది డబ్బును లెక్కే చేయరు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. వీరు డబ్బు ఖర్చు గురించి పెద్దగా ఆలోచించరు. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులు వారు చాలా పొదుపుగా ఉంటరు. ఒక్క రూపాయిని ఖర్చు చేయడానికి వందసార్లు ఆలోచిస్తుంటారు. కానీ ఈ లక్షణం ఇతరులకు చికాకు కలిగిస్తుంది. ఇంతకీ ఈ రాశుల వారు ఎవరెవరంటే?
వృషభ రాశి
ఈ రాశి వారు డబ్బును బాగా పొదుపు చేస్తారు. అంతేకాదు ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి వందసార్లు దాని లాభ నష్టాల గురించి ఆలోచిస్తారు. అంతా సవ్యంగా ఉందనుకుంటేనే డబ్బును ఖర్చు చేస్తారు. ఇకపోతే వీళ్లకు డబ్బును ఖర్చు చేయడం అస్సలు ఇష్టం ఉండదు.
మిథున రాశి
ఈ రాశి వారు తమ డబ్బును ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ స్నేహితులు, వేరేవాళ్లు డబ్బు ఖర్చు చేస్తే మాత్రం ఆనందిస్తారు. వీళ్ల డబ్బు ఖర్చు కాకూడదని ఈ రాశివారు అనుకుంటారు. ఇకపోతే పొదుపు విషయంలో కూడా వీళ్లు చాలా తెలివిగా ఉంటారు.
కన్య రాశి
ఈ రాశి వారు డబ్బు విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు. వీళ్లు డబ్బును పొదుపు బాగా చేస్తారు. ఈ రాశివారు ప్రతి విషయాన్ని డబ్బు పరంగానే లెక్కిస్తారు. అలాగే వారి డబ్బు ఎక్కడికి వెళ్లిందో ట్రాక్ చేస్తుంటారు. దేని దేనికి ఖర్చుచేస్తున్నారో ప్రతి విషయాన్ని రాసి పెట్టుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు డబ్బు ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు.వీళ్లు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఖర్చు చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. వీళ్లు తమ డబ్బును బయటకే తీయరు. అలాగే వీళ్లు ఎవ్వరికోసం కూడా ఖర్చు చేయరు.
మకర రాశి
అనవసర ఖర్చుల నుంచి తమను తాము నియంత్రించుకోవడంలో ఈ రాశివారు మంచి ఉదాహరణ. అలాగే వీరు చాలా డబ్బు ఖర్చు చేసి తమ స్థాయిని ఎలా చూపిస్తారో అని అసహ్యించుకుంటారు. వీరికి డబ్బును ఖర్చు చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు.