విజయశాంతి చేద్దామనుకున్న పాత్రని అనుష్క చేసేసింది, ఆ సినిమా ఆడిందా?
నటుడుకి అయినా నటి కు అయినా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలాగే విజయశాంతి సైతం తన రీఎంట్రీ టైమ్ లో ఓ పాత్ర చేద్దామనుకున్నారు. కానీ అనుష్క చేసేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Vijayashanti
నటికి అయినా నటుడుకి అయినా డ్రీమ్ రోల్స్ ఉంటాయి. వాటిని చేద్దామనుకునే లోపల వేరే వాళ్లు చేసేయచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కు అల్లూరి సీతారామరాజుగా కనపడాలని ఉండి స్క్రిప్టు రెడీ చేసుకున్నారు. అయితే ఈ లోగా కృష్ణ ఆ సినిమా చేసేసారు. దాంతో చాలా కాలం పాటు వారి మధ్య ప్రచ్చన్న యుద్దం జరిగింది అంటారు. అలాగే విజయశాంతి సైతం తన కెరీర్ లో తనకు ఇష్టమైన పాత్రలో కనిపించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ పాత్రను అనుష్క చేసేసింది.
రాజకీయాలతో బిజీగా ఉన్నవిజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య సినిమాల గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లో వెళ్లి విజయశాంతి మళ్లీ పెద్దగా కనిపించలేదు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ప్రచారం చేశారు. గతంలో బీజేపీలో ఉన్న ఆమె బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు.
లేడీ సూపర్ స్టార్.. టాలీవుడ్ లేడీ అమితాబచ్చన్ గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్న విజయశాంతి.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భారీ రెమ్మూనరేషన్, కథలో ఇంపార్టెన్స్ ఉంటేనే నటిస్తానని చప్పేసిందట. అంతే కాదు.. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా ఛాన్స్ లు వచ్చినా వద్దనుకుంది విజయశాంతి రాజకీయాల మీదే ఫోకస్ పెట్టింది. అలాంటి సినిమాలు ఉంటేనే ఓకే చెప్తోంది.
వాస్తవానికి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అలరిస్తున్నారు ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti). మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆకట్టుకున్న ఆమె తాజాగా కల్యాణ్‌రామ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆమె రీఎంట్రీ టైమ్ లో ఆమె చేద్దామనుకున్న ఓ పాత్రను అనుష్క చేసేయటంతో వెనక్కి తగ్గాల్సివచ్చింది. ఆ పాత్ర ఏమిటి
విజయశాంతి మాట్లాడుతూ...‘‘నేను తెలంగాణ బిడ్డను. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను. ఆ సమయంలో ‘రుద్రమదేవి’ సినిమాతో రీ ఎంట్రీ ఇద్దామని అనుకున్నాను. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మహారాణి రుద్రమదేవి. ఆమె కథతో రీ ఎంట్రీ ఇస్తే బావుంటుందనిపించింది.
<p>vijayashanthi</p>
అయితే ఏదో ఆషామాషీగా చేసేసే సినిమా అయితే కాదది. స్క్రిప్ట్ సహా అన్నింటినీ తయారు చేసుకుంటున్నాం. ఆలస్యం అవుతూ వచ్చింది. బడ్జెట్ ఎక్కువగా అవుతుంది. ఏదేమైనా నా సొంత సినిమాగా తీయాలని అనుకున్నారు. ఈలోపు తెలంగాణ రావడంతో మళ్లీ సినిమా ఆలస్యమైంది. ఈలోపు ఆ సినిమాను మరొకరు తీసేశారు’’ అన్నారు విజయ శాంతి.
రుద్రమదేవి సినిమా చూసి నేనైతే మరోలా ఉండేదని అనిపించిందా? అని మీడియావారు అడిగిన ప్రశ్నకు ‘‘నేను ‘రుద్రమదేవి’ సినిమాను చూడలేదు. నాకు కుదరలేదు. కాావాలనుకుంటే దాన్ని మరో రకంగా తీయొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సమయం ఉంటుందో లేదో చెప్పలేను. బాహుబలిలా ఎక్కువ సమయం పడుతుంది. మామూలు సినిమాను చకచకా చేసెయొచ్చు కానీ రుద్రమదేవి సినిమాను మామూలుగా చేయలేం. సమయం పడుతుంది’’ అన్నారు విజయశాంతి.
అనుష్క శెట్టి టైటిల్ పాత్రలో గుణ శేఖర్ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’. త్రీడీ టెక్నాలజీతో సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. అల్లు అర్జున్ పేరు చెప్పి సినిమా ఆడిందనే విమర్శలు వచ్చాయి. బన్ని లేకపోతే ఆ మాత్రం కలెక్షన్స్ కూడా రావని చెప్పుకున్నారు.
కల్యాణ్ రామ్ (Kalayam Ram) హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన ఆ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర ఆమె సూపర్ హిట్ చిత్రం కర్తవ్యం ను పోలి ఉంటుందని సమాచారం.
<p>kishan reddy meets vijayashanthi</p>
కల్యాణ్ రామ్ 21వ చిత్రం.. #NKR21 వర్కింగ్ టైటిల్ గా షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్ మూవీగా ఇది రూపొందనుంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఇందులో కీలకపాత్రలో నటించటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, కర్తవ్యం లో విజయశాంతిలో ఉండే ఎమోషన్ ఇందులో క్యారీ ఫార్వర్డ్ అవుతుందని అంటున్నారు.
అలాగని ఈ సినిమాలో విజయ శాంతి చేస్తున్నది పోలీస్ పాత్ర మాత్రం కాదు. తన కుమార్తె ని గైడ్ చేస్తూ ఆమెకు వచ్చే ఇబ్బందులు, సమస్యలనుంచి బయిటపడేలా ధైర్యం ఇస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది ఈ పాత్ర. విజయశాంతి కొన్ని ఎపిసోడ్స్ లో చేసే నటనకు ఫ్యాన్స్ థ్రిల్ అవుతారు అంటున్నారు.
NKR21 అనేది ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన 'మేజర్' ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించనుంది. 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రారంభోత్సవ వేడుకలో కళ్యాణ్ రామ్ తో పాటుగా విజయ శాంతి, సయీ మంజ్రేకర్ సందడి చేసారు.