ఘజియాబాద్: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్  రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా చెప్పారు.గురువారం నాడు భారత వైమానిక దళం దినోత్సవాన్ని పురస్కరించుకొని  జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత వైమానిక దళం అభివృద్ది చెందుతుందన్నారు. అన్ని వేళల్లో దేశ సార్వభౌమత్వాన్ని ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని ఆయన దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. హిందన్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ఎయిర్ ఫోర్స్ 89వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోందన్నారు. ఐఎఎఫ్ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయన్నారు. తాము  ఏరోస్పేస్ శక్తిని వినియోగించుకొంటామన్నారు. ఇంటిగ్రేటేడ్ మల్టీ డొమైన్ ఆపరేషన్లను నిర్వహిస్తున్న  యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఆయన చెప్పారు.

ఎయిర్ ఫోర్స్ కు చెందిన యోధులు చిత్తశుద్దితో ఈ కాలంలో పూర్తి స్థాయి కార్యకలాపాలను చేపట్టే సామర్ధ్యాన్ని ఐఎఎఫ్ ఎప్పుడూ నిలుపుకొనే ఉంటుందన్నారు.

ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాల్లో ఎయిర్ ఫోర్స్ కు చెందిన అన్ని విభాగాల యోధులు అతి తక్కువ కాలంలో స్పందించిన తీరును  ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఉత్తర భారత సరిహద్దులో చోటు చేసుకొన్న పరిణామాల్లో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అతి తక్కువ కాలంలోనే చూపిన చొరవను ఆయన అభినందించారు.

ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో జరిగిన 88వ భారత వైమానిక దళ దినొత్సవ వేడుకల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ , జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే, నావల్ స్టాప్ ఛీప్ ఆడ్మిరల్ కరంబీర్ సింగ్ పాల్గొన్నారు.

చీఫ్ ఎయిర్ మార్షల్  రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా 88వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ ను తనిఖీ చేశారు.ఘజియాబాద్ లోని హిండన్ వైమానిక దళం స్టేషన్ లో స్వ్కాడ్రన్ శివంగి రాజవత్ నేతృత్వంలో నిషన్ టోలి కవాత్ నిర్వహించారు.

88వ భారత వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించుకొని  రెండు చినూక్  హెలికాప్టర్లు కూడ ఫ్లైపాస్ట్ లో పాల్గొన్నాయి.