Asianet News TeluguAsianet News Telugu

  ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదు..ప్రభుత్వ అనుమతి లేదు.. అయినా సందర్శకులను ఎలా అనుమతించారు? 

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి విషాదంపై అనేక ప్ర‌శ్న‌లు ఉత్పన్నమవుతున్నాయి.ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకుండా.. కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఎలా తిరిగి ప్రారంభించారు. కేవలం 100 మంది సామర్థ్యం ఉన్న వంతెనపైకి 400 మందిని ఎలా అనుమతించారు అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. 

No Certificate, No Government Permission Before Reopening Bridge
Author
First Published Oct 31, 2022, 5:50 AM IST

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం  కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 90పైగా మరణించినట్లు సమాచారం. అదే సమయంలో చాలా మంది ఆసుపత్రిలో చేరారు. ఘటనా స్థలంలో భారీ సహాయక చర్యలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో చూస్తే..  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. 

ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం నిర్లక్ష్యం  బయటపడుతోంది. దాదాపు 6 నెలల పాటు మరమ్మత్తు పేరిట ముసివేశారు. బ్రిడ్జి మరమ్మతుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను వెచ్చిండం కూడా చర్చనీయమైంది. దీపావళి తర్వాత రోజే ఈ వంతెనను తిరిగి ప్రారంభించారు. మరమ్మతులు చేసి తెరిచిన ఐదు రోజుల్లోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో.. బ్రిడ్జి మరమ్మతులు, బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒరేవా కంపెనీ పాత్రపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు 

మోర్బిపై నిర్మించిన ఈ బ్రిటీష్ కాలం నాటి వంతెన నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం ఒధవ్జీ పటేల్ యాజమాన్యంలోని ఒరేవా గ్రూప్‌
చూస్తుంది. వాస్తవానికి.. అంతకుముందు ఈ వంతెన నిర్వహణ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్‌ చేసేంది. తర్వాత దీని కోసం ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇదే ట్రస్ట్ కొంతకాలం క్రితం టెండర్ ద్వారా దాని పునర్నిర్మాణం మరియు నిర్వహణ ఒప్పందం కోసం ఒరేవా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత మార్చి 2022 నుండి మార్చి 2037 వరకు 15 సంవత్సరాల పాటు ఈ వంతెన నిర్వహణ, శుభ్రపరచడం, భద్రత , టోల్ వసూలు వంటి అన్ని బాధ్యతలను ఈ బృందం తీసుకుంది.

 ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదు.. ప్రభుత్వ అనుమతి లేదు

మరమ్మతుల పేరిట ఈ  వంతెనను దాదాపు ఏడు నెలల పాటు ముసివేసి.. దీపావళి మరుసటి రోజు  తిరిగి తెరిచారు. మోర్బీ మున్సిపాలిటీ అధికారి సందీప్‌సిన్హ్ జాలా మాట్లాడుతూ..పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఇది ప్రజలకు తెరవబడింది, అయితే స్థానిక మునిసిపాలిటీ ఇంకా ఎటువంటి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (పునరుద్ధరణ పని తర్వాత) జారీ చేయలేదు. అలాగే ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. 

ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఒరేవా కంపెనీ, స్థానిక పాలకవర్గం నిర్లక్ష్యం తెరపైకి వచ్చింది.  ఈ అజాగ్రత్త దృష్ట్యా, వంతెన గరిష్ట సామర్థ్యం 100 మంది ఉంటే.. ఆదివారం ప్రమాద సమయంలో మోర్బి వంతెనపైకి 400 మందికి పైగా ఎలా చేరుకున్నారనేది పెద్ద ప్రశ్న వెలుగులోకి వచ్చింది. అలాగే మరమ్మత్తు తర్వాత స్థానిక మున్సిపాలిటీ ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వనప్పుడు, ఎవరి ఆదేశంతో వంతెనను తిరిగి ప్రారంభించారు? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. 

వంతెన సామర్థ్యం 100 మంది

అందిన సమాచారం ప్రకారం, ఈ వంతెన సామర్థ్యం కేవలం 100 మంది మాత్రమే. అదే సమయంలో ఈ వంతెనపైకి రావాలంటే దాదాపు రూ.15 రుసుము కూడా వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి తర్వాత వీకెండ్‌లో సంపాదించాలనే దురాశతో ఫిట్‌నెస్‌ చెక్‌ చేయకుండానే ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 400 నుంచి 500 మంది వంతెనపై ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. వంతెన కూలినట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios