ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు పెట్టలేం
ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం నిర్దేశించినవి మినహా ఎలాంటి అదనపు ఆంక్షలు పౌరుడిపై విధించరాదని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్నలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

Supreme Court: బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ.. ఓ మంత్రి చేసిన ప్రకటనను మొత్తం ప్రభుత్వానికి ఆపాదించలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో 2016లో నమోదైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఈ తీర్పును వెలువరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్న పరిమితులు మినహా.. స్వేచ్ఛా వ్యక్తీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యం కూడా ఉన్నారు. సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ, ఒక మంత్రి చేసిన ప్రకటన రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా లేదా ప్రభుత్వానికి ఆపాదించలేమని, ఆ ప్రకటనకు మంత్రి స్వయంగా బాధ్యులని పేర్కొంది. ఆర్టికల్ 19(1) కింద ఉన్న ప్రాథమిక హక్కును రాష్ట్రం కాకుండా ఇతర వ్యవస్థకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
ఆర్టికల్ 19లోని ఆంక్షలకు తోడు భావ ప్రకటనా స్వేచ్ఛపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించలేమని ధర్మాసనంలో సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. ఒకవేళ మంత్రి అధికార హోదాలో ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ప్రభుత్వానికి ఆపాదించవచ్చని స్పష్టంచేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజంలో అసమానతలను సృష్టించడం ద్వారా మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. విభిన్న నేపథ్యాల పౌరులు ఉన్న భారత్ వంటి దేశంలో ద్వేషపూరితమైన వ్యాఖ్యలు స్వేచ్ఛను, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం పౌరులకు ఎంతో అవసరమైన హక్కు అని, దీనిపై పౌరులకు అవగాహన కల్పించాలని అన్నారు.
బెంచ్‌లో భాగమైన జస్టిస్ బివి నాగరత్న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ చాలా ముఖ్యమైన హక్కు అని, తద్వారా పౌరులు పాలన గురించి బాగా తెలుసుకుంటారు. విద్వేషపూరిత ప్రసంగాలు అసమాన సమాజాన్ని సృష్టిస్తాయనీ, తద్వారా మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. విభిన్న నేపథ్యాల పౌరులు ఉన్న భారత్ వంటి దేశంలో ద్వేషపూరితమైన వ్యాఖ్యలు స్వేచ్ఛను, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం హక్కులపై పౌరులకు అవగాహన కల్పించాలని అన్నారు. మతం, కులం మొదలైన వాటితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం, మహిళల గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ఆమె తెలిపారు.
ఆర్టికల్ 19(1)(ఎ), 19(2)లను దృష్టిలో ఉంచుకుని తోటి పౌరులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వ కార్యకర్తలను నిరోధించేందుకు చట్టాన్ని రూపొందించడం పార్లమెంటుకు విజ్ఞతతో కూడుకున్నదని ఆమె అన్నారు. రాజకీయ పార్టీలు తమ మంత్రులు చేసే ప్రసంగాలను నియంత్రించాలని, ప్రవర్తనా నియమావళిని రూపొందించడం ద్వారా చేయవచ్చని జస్టిస్ నాగరత్న అన్నారు. ఎవరైనా పౌరులు ఇలాంటి ప్రసంగాలు లేదా ప్రజా కార్యకర్తల ద్వేషపూరిత ప్రసంగాల వల్ల దాడికి గురైతే సివిల్ రెమెడీస్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ నాగరత్న అన్నారు.
ఆర్టికల్ 19(2)లో ఉన్న సహేతుకమైన ఆంక్షలు మినహా ప్రజా ప్రతినిధులపై అదనపు ఆంక్షలు విధించలేమని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె తోటి న్యాయమూర్తుల అభిప్రాయంతో ఏకీభవించారు. మంత్రి ప్రకటనను ప్రభుత్వ ప్రకటనగా పరిగణించాలా వద్దా అనే విషయంపై మంత్రి వ్యక్తిగతంగానూ, అధికారికంగానూ ప్రకటన ఇవ్వవచ్చని అంటున్నారు. మంత్రి తన వ్యక్తిగత హోదాలో ప్రకటన ఇస్తే.. అది వ్యక్తిగత ప్రకటనగా పరిగణించబడుతుంది, అయితే అతను ప్రభుత్వ పనికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే.. అతని ప్రకటనను ప్రభుత్వ సమష్టి ప్రకటనగా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది.
రాజ్యాంగ పదవుల్లో కూర్చున్న వ్యక్తులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని జస్టిస్ బి.వి. నాగరత్న అన్నారు. ప్రవర్తనా నియమావళిని రూపొందించడం ద్వారా చేయగలిగిన మంత్రుల ప్రసంగాలను నియంత్రించడం పార్టీపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులు చేసే ఇటువంటి ప్రసంగాల వల్ల లేదా ద్వేషపూరిత ప్రసంగాల వల్ల బాధపడే ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చని స్ఫష్టం చేశారు.