నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ హోమ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తున్నాయి.

వినియోగదారుల హక్కులను కాపాడేందుకు, గ్యాస్ సిలిండర్లలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు చెబుతున్నాయి. గ్యాస్ సిలిండర్ కొత్త హోమ్ డెలివరీ వ్యవస్థకు డీఏసీ అని పేరు పెట్టారు.

డీఏసీని డెలివరీ అథంటికేషన్ కోడ్ అని పిలుస్తారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇంటికి గ్యాస్ సిలిండర్ వెంటనే డెలీవరి అవ్వదు. మళ్లీ మీరు ఈ కోడ్‌ను తెలియజేయాలి.

గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డీఏసీ మెసేజ్ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాలి. అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతవరకు కోడ్ మీ వద్దనే ఉంటుంది.