మీరు కోరున్నది జరగాలంటే ఏం చేయాలో తెలుసా?
మన వంటింట్లో లభించే కొన్నిరకాల మసాలా దినసులు, సువాసనను అందించే కొవ్వత్తులు, బిర్యానీ ఆకు, ఉప్పు, దాల్చిన చెక్క లాంటివి ఉపయోగించి.. మన కోరికలను నిజం చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరికీ ఏవేవో కోరికలు ఉంటాయి. అయితే... ఆ కోరికలు తీరడం, తీరకపోవడం అనేది మనం దానిని ఎంత బలంగా కోరుకుంటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుందట. మీరు చదివింది నిజమే. మనసులో బలంగా కోరుకుంటే... కచ్చితంగా కోరుకున్నది జరుగుతుందని జోతిష్యశాస్త్రం కూడా చెబుతోంది. మనం ఏదైతే జరగాలి అని అనుకుంటున్నామో... దానిని ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మాలట. దీనిని మానిఫెస్టేషన్ అని కూడా అంటారు. ఈ మానిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి..? దాని కోసం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం...
మన వంటింట్లో లభించే కొన్నిరకాల మసాలా దినసులు, సువాసనను అందించే కొవ్వత్తులు, బిర్యానీ ఆకు, ఉప్పు, దాల్చిన చెక్క లాంటివి ఉపయోగించి.. మన కోరికలను నిజం చేసుకోవచ్చు.
bay leaf
1.బిర్యానీ ఆకు...
మీ ఆలోచనలు, కోరికలు, కోరికలు లేదా లక్ష్యాలను బిర్యానీ ఆకు మీద వ్రాసి, ఆపై ఆకును కాల్చాలి లేదా మీ వాలెట్‌లో ఉంచాలి. మీకు రావాల్సిన డబ్బులు, జీతం, ఫైనాన్స్ లాంటి వాటిని నిజం చేసుకోవడానికి ఈ బిర్యానీ ఆకు మానిఫెస్టేషన్ ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకు.. మీ జీతం పెరగాలి అనుకోండి. ఎంత పెరిగితే బాగుంటుందో.. ఆ ఆకుమీద... ఆ ల్రెడీ మీరు అనుకున్నంత జీతం పెరిగినట్లు రాసుకొని.. నిజంగా అంత జీతం వచ్చినట్లు నమ్మాలి. తర్వాత.. దానిని బిర్యానీ ఆకుమీద రాయాలి.
bay leaf
2.ఇదే బిర్యానీ ఆకు ఉపయోగించి మీరు ఇతర కోరికలు కూడా తీర్చుకోవచ్చు. ఏదైనా కూజా తీసుకొని దానిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ కూజాలో మీ కోరికలు నిజమైనట్లు భావించి వాటిని ఆ బిర్యానీ ఆకు మీద రాసి వాటిని ఆ కూజాలో వేయాలి. ఆఆకులతో పాటు.. కొన్ని స్పటికాలు కూడా ఆ కూజాలో వేయాలి. ఇలా చేయడం వల్ల,... కొద్ది రోజులకు మీ కోరిక నిజం అవుతుంది.
3.దాల్చిన చెక్కతో కూడా మీరు అనుకున్నది నిజం చేసుకోవచ్చు. నిజానికి మనం దాల్చిన చెక్కను వంటల్లో వాడతాం. అయితే... దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి. . ఆ పొడిని మీ చేతిలో తీసుకుని, మీ పిడికిలిని మూసుకోండి. దాన్ని మూసివేసిన తర్వాత, మీ కళ్ళు మూసుకుని, మీ కోరికను తలుచుకోవాలి. మీ కోరికను చాలా బలంగా కోరుకోవాలి. తర్వాత... ఆ దాల్చిన చెక్క పొడిని మీ ఇంటి చుట్టూ చల్లుకోవాలి. మరుసటి రోజు.. ఆ దాల్చిచ చెక్క పొడిని ఊడ్చేసి.. మీ పెరట్లో చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది.