మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసి, నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు శుక్రవారం ఆ విషయం చెప్పారు.

సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ ను గుర్తించగలిగారు. 

ఆ తర్వాత ఆమెను బులంద్ షహర్ లోని సియానా నుంచి కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గర్హ్ ముక్తేశ్వర డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ తేజ్ వీర్ సింగ్ ఆ విషయం చెప్పారు. 

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. వైద్య కళాశాల ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.