Asianet News TeluguAsianet News Telugu

అన్నను చంపి, శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు.. తండ్రి సాయంతో పారేసి.. చివరికి..

షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి డ్రగ్స్ కు బానిసైన అన్నను చంపి, శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు. ఆ తరువాత తండ్రి సాయంతో మృతదేహాన్ని డంప్ చేశాడు. 
 

Man Kills Brother, Hides Body Under Bed In Delhi
Author
First Published Dec 16, 2022, 2:00 PM IST

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ వ్యక్తి తన అన్నను చంపి మంచం కింద దాచిపెట్టాడు. ఆ తరువాత తండ్రి సహాయంతో మృతదేహాన్ని పారేసి వచ్చాడు. అయితే ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. వివరాల్లోకి వెడితే... ఢిల్లీ మంగోల్‌పురిలో మంగళవారం తన సోదరుడిని హత్య చేసినందుకు 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన సోదరుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. 
అంతకుముందు తన తండ్రితో కలిసి మృతదేహాన్ని పారేసిన స్థలాన్ని గుర్తించడంలో పోలీసులకు సహాయం చేశాడు. షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లలిత్ కుమార్,  జైకిషన్ (30) అన్నాదమ్ములు. జై కిషన్ డ్రగ్స్ కు బానిస. డబ్బుల కోసం కుటుంబంతో నిత్యం గొడవ పడేవాడని లలిత్ కుమార్ చెప్పాడు.

సోమవారం సాయంత్రం కూడా ఇంట్లో అలాంటి ఘటనే జరిగింది. జైకిషన్ తన తల్లితో గొడవపడి ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం, అతని తండ్రి,  సోదరుడు కూడా పని కోసం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో లలిత్.. జైకిషన్ తలపై సుత్తితో కొట్టి చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

వైరల్.. మొదటిసారి మంచును చూసిన ఎడారి ఒంటె.. సంతోషంతో పిల్లమొగ్గలేస్తూ కేరింతలు..

సాయంత్రం కుటుంబసభ్యులు తిరిగి రాగానే లలిత్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం తండ్రి సాయంతో జైకిషన్ మృతదేహాన్ని ఆనవాళ్లు దొరకకుండా దూరంగా పారేశారు. ఆ రోజు సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న అతని తల్లి, కొడుకును కొప్పడింది... పోలీసుల వద్దకు వెళ్లి నేరం ఒప్పుకోమని చెప్పింది.

దీంతో లలిత్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. జరిగిన విషయం చెప్పి తన సోదరుడి మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకువెళ్లాడు. జైకిషన్ మృతదేహం వారి ఇంటికి సమీపంలోని పార్కులో ప్లాస్టిక్ షీట్‌లో చుట్టి కనిపించింది. లలిత్ మరో సోదరుడు ఆకాష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను దాచడం), 34 (సాధారణ ఉద్దేశం) కింద లలిత్, అతని తండ్రి ఓంప్రకాష్‌పై కేసు నమోదు చేశారు. ఇంట్లో నుంచి నేరానికి ఉపయోగించిన సుత్తి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios