Asianet News TeluguAsianet News Telugu

వైరల్.. మొదటిసారి మంచును చూసిన ఎడారి ఒంటె.. సంతోషంతో పిల్లమొగ్గలేస్తూ కేరింతలు..

ఓ ఒంటె మొదటిసారి మంచును చూసింది. అప్పుడు దాని భావోద్వేగం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. దాంతో పాటు మీరూ గెంతులేస్తారు. 

Camel Video goes viral as he Witnesses Snow For The First Time
Author
First Published Dec 16, 2022, 1:15 PM IST

ఎడారిలో, మండుటెండల్లో తిరిగే ఒంటె జీవితంలో మొదటిసారి మంచును చూస్తే ఎలా ఫీలవుతుంది? సంతోషంతో గంతులు వేస్తుంది.. దాని ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మూగ ప్రాణులు అవి చిన్నవైనా, పెద్దవైన అవి చేసే చిలిపి పనులు నవ్వు తెప్పిస్తాయి. మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాంటి ఓ వీడియోనే ఇది. 

వ్యవసాయ, జంతు సంరక్షణ కేంద్రం అయిన రాంచో గ్రాండే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోలో, ఆల్బర్ట్ అనే ఒంటె మొదటిసారి మంచును చూస్తుంది. అంతే అది సంతోషంతో పిల్లిమొగ్గలు వేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఒంటె తన సంతోషాన్ని తన స్నేహితులైన మేకల మందతో పంచుకుంటుంది. అక్కడున్న తన ఫేవరేట్ స్పాట్స్ అన్నీ వాటికి చూపిస్తుంది. ఈ వీడియోలోని వాయిస్‌ఓవర్ ప్రకారం, అది మంచు ఒంటె.

దీనికి క్యాప్షన్ ఇలా జోడించారు.. "మేము దీనిని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసాం. ప్రతి ఒక్కరినీ ఈ వీడియో చాలా సంతోషపెట్టినట్లు అనిపించింది. మా ఉద్దేశం కూడా అదే. అందుకే దీన్ని ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయాలనుకున్నాం. మీ అందరి ఆదరణకు ధన్యవాదాలు’ అంటూ ఈ వీడియో రెండు రోజుల క్రితం షేర్ చేశారు. అప్పటి నుండి 71,000 వ్యూస్, ఆరు వేల లైక్‌లు ఈ వీడియోకు వచ్చాయి. 

వంటిల్లు తెలంగాణలో.. బెడ్రూం మహారాష్ట్రలో.. ఓ ఇంటి వింత కథ.. రెండు రాష్ట్రాల్లోనూ పన్నులు, పథకాలు...

‘ఇది చాలా విలువైన వీడియో, దీన్ని ప్రతీరోజూ చూస్తున్నాను’.. అంటూ ఒకరు చెప్పగా.."ఆల్బర్ట్, అతని స్నేహితులందరూ నాకు బాగా నచ్చారు. నేను ఈ వీడియోను అనేకసార్లు చూశాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరికీ షేర్ చేసాను. దయచేసి ఆల్బర్ట్, అతని స్నేహితులందర్నీ నేను త్వరలో చూడడానికి వస్తున్నానని చెప్పండి.. అంటూ కామెంట్ చేశాడు. 

ఒంటె"నేను ఇక దీన్ని ప్రేమించలేనేమో!!" అని ఒకరంటే.. "ప్రతి ఒక్కరూ ఇప్పుడు పెంపుడు ఒంటెను కోరుకుంటారు," అని నాల్గవ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇంకొకరేమో సింపుల్ గా "ఓ ఆల్బర్ట్!!! అంటూ కామెంట్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios