పూణె:ఏడాది వయస్సున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

మహరాష్ట్రలోని పూణెలోని కల్బోరా ప్రాంతంలో తల్లిదండ్రులతో ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని మల్హరి బన్సోదే అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అయితే తమ పక్కనే పడుకొన్న చిన్నారి కన్పించకుండాపోయిన విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు  చుట్టుపక్కల గాలించారు. 

అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారి మృతదేహం మాత్రం లభ్యం కాలేదు.  అయితే అదే సమయంలో వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. 

మృతదేహన్ని  పోస్టు మార్టానికి పంపితే పోస్టుమార్టంలో పాపపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. అత్యాచారం చేసిన తర్వాత పాపను చంపేసినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది.  సీసీటీవీ పుటేజీలో దృశ్యాల ఆధారంగా బాలికను కిడ్నాప్ చేసింది మల్హరి బన్సోదేగా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాపపై అత్యాచారానికి పాల్పడినట్టుగా నిందితుడు ఒప్పుకొన్నాడని పోలీసులు ప్రకటించారు.

చిన్నారి తల్లిదండ్రులు తమిళనాడు నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.  పొట్టకూటి కోసం వచ్చి తమ చిన్నారిని ఆ దంపతులు పోగొట్టుకొన్నారు.