ముంబై:  యువతిని బెదిరించి  లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తన స్నేహితులతో కూడ గడపాలని కోరిన నిందితుడిపై  ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది. 

పెళ్లి చేసుకొంటానని చెప్పి నమ్మించి తనను లోబర్చుకొన్న ధరన్ షా అనే వ్యక్తి  సెప్టెంబర్ 9వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కెనడా వెళ్లేందుకు సహకరించేందుకు  సహకరిస్తారని తన స్నేహితులతో కూడ లైంగికంగా సహకరించాలని బెదిరించినట్టు బాధితురాలు  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

అంతేకాదు ఈ నెల 3వ తేదీన నిందితుడు తనపై తొలిసారిగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె చెబుతున్నారు.  తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే  ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని  తనపై దాడికి దిగాడని ఆమె ఆరోపిస్తున్నారు.

పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను లోబర్చుకొన్న నిందితుడు  పెళ్లి ప్రస్తావన రాగానే తనను బ్లాక్ మెయిల్  చేస్తున్నాడని బాధితురాలు చెబుతున్నారు. తన నుండి రూ. 3 లక్షల నగదు, రూ. లక్ష విలువైన బంగారు ఆభరణాలను , ల్యాప్ టాప్ ను కూడ తీసుకొన్నాడని  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు చదవండి

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే..

ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా.

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

ఎఫైర్: భార్య ప్రియుడికి షాకిచ్చిన భర్త