భోపాల్: తనపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని ఓ మహిళ అత్యంత కసితో హత్య చేసింది. ఆ వ్యక్తిపై తిరగబడి 25 కత్తిపోట్లు పొడిచింది. తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ సంగటన మధ్యప్రదేశ్ లోని గుణలో గత సోమవారం చోటు చేసుకుంది.

మృతుడిని బ్రిజ్ భూషణ్ శర్మగా పోలీసులు గుర్తించారు. అశోక్ నగర్ లో నివాసం ఉండే శర్మ తనపై 15 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శర్మ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దానికి సంబంధించిన వీడియో తీసి 15 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. 

పెళ్లి చేసుకుని తన జీవితం తాను బతుకుతానని చెప్పినా వినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆనాటి వీడియోతో తనను నిత్యం వేధిస్తున్నాడని, ఘటన రోజు కూడా అతని తీరు మారలేదని ఆమె చెప్పింది. పని మీద తన భర్త బయటకు వెళ్లాడని, ఆ సమయంలో తప్ప తాగి వచ్చిన శర్మ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఆమె చెప్పింది. 

ఆగ్రహం, ఆవేశాలతో అతనిపై దాడి చేసి అతన్ని చంపేశానని చెప్పింది. ఆ కామాంధుడి వల్ల తన తన జీవితం నాశరమైందని ఆమె చెప్పింది. తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పింది. నిందితురాలిపై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసింది.