Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్‌లో సెక్స్ రాకెట్: రాజకీయ నాయకులు, అధికారులు...వెయ్యి క్లిప్పులు

మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చిక్కుకున్నారని తేల్చారు

Madhya Pradesh sex scandal: police is scrutinizing more than 1000 videos
Author
Bhopal, First Published Sep 26, 2019, 4:50 PM IST

మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చిక్కుకున్నారని తేల్చారు.

ఈ రాకెట్‌తో సంబంధమున్న ఆర్తీ దయాళ్, మోనికా యాదవ్, ఓమ్ ప్రకాశ్ కోరి, శ్వేతా స్వాప్నిల్ జైన్, శ్వేతా జైన్, బార్కా సోనీ భట్నాగర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ప్రముఖులను గుర్తించి వారిని ఎలా ఉచ్చులోకి లాగాలి, ఎవరిని ఎరగా వేయాలనే దానిపై వీరు కోడ్ లాంగ్వేజ్ రాసుకున్నారు. అలా లక్ష్యంగా చేసుకున్న వీఐపీని గెస్ట్‌హౌస్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌కు శ్వేతా స్వాప్నిల్ జైన్ అనే మహిళ ఆహ్వానించేది.

అంతేకాకుండా ఆ వ్యక్తి అధికారిక పర్యటనల నిమిత్తం ముంబై, ఢిల్లీ వెళ్లినప్పుడు టాప్ మోడల్స్, కాల్ గర్ల్స్, బాలీవుడ్ నటీమణులను ఎరగా వేసేది. వారు ఏకాంతంగా వివిధ భంగిమల్లో ఉన్నప్పుడు చాటుగా వీడియోలు చిత్రీకరించి వాటి సాయంతో ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసేది.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. హనీ ట్రాప్ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

తన భర్త నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించే క్రమంలో శ్వేతా ఈ హనీట్రాప్‌లోకి లాగినట్లుగా పోలీసులు నిర్థారించారు. ఆమె భర్త నుంచి ఐదు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సుమారు 1000 వీడియోలను పరిశీలించారు.

బ్లాక్‌మెయిలింగ్‌లో భాగంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతమైన మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లాను బహుమతిగా ఇచ్చారని.. అలాగే మరో మహిళ ఆర్తీ దయాల్‌ కూడా ఐఏఎస్ అధికారి నుంచి ఒక ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా పొందినట్లు తెలిపారు.

దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్ రాకెట్ చాలా సంవత్సరాలుగా సాగుతోందన్నారు. బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని ఆయన ఆరోపించారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలను ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుంభకోణంలో ఇరికిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మండిపడ్డారు.

మరోవైపు ఈ ముఠా జాబితాలో అగ్రికల్చర్, ఫిషరీస్, కల్చర్, ఇండస్ట్రీస్, పట్టణాభివృద్ధి, లేబర్, అటవీ, జలవనరులు, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో పనిచేసి వివిధ అధికారులు ఉన్నారు.

వీరి పేర్లకు బదులుగా నిక్ నేమ్స్, కోడ్‌లు మార్క్ చేశారు. టార్గెట్ లిస్ట్‌లో ఉన్న అధికారులు ఎవరో గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios