ఎఫైర్: ఆ సంబంధం కోసం ఇంటికొస్తే... దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 16, Aug 2018, 2:53 PM IST
Krishnaveni kills vijayudu for extramarital affair in kurnoll district
Highlights

 వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలో జరిగింది.  

కర్నూల్: వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధించిన మాజీ ప్రియుడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలో జరిగింది.  మృతదేహన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూల్ మండలంలోని నిడ్జూరు గ్రామానికి చెందిన గొల్ల విజయుడుకు అదే గ్రామానికి చెందిన  ఓ మహిళతో  చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉంది.  విజయుడుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.  అయితే  ఐదేళ్ల క్రితం నుండి విజయుడితో ఆ మహిళ వివాహేతర సంబంధాన్ని తెంచేసుకొంది.

అయితే  విజయుడు మాత్రం  తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఆమెను వేధించడం ప్రారంభించాడు. అయితే ఆమె మాత్రం వినలేదు.  ఆగష్టు 14 వ తేదీ రాత్రి విజయుడు  ఆ మహిళ ఇంటికి వెళ్లాడు.

తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. కోపంతో  ఆ మహిళ రోకలిబండతో  విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు  కత్తితో పొడించింది. ఇంటికి తాళం వేసి పారిపోయింది.  ఆ తర్వాత బుధవారం సాయంత్రం ఆమె పోలీసులకు లొంగిపోయింది.నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు  సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.  మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ వార్తలు చదవండి

పదేళ్లుగా లవ్: మరో యువతితో పెళ్లి, మాజీ లవర్‌పై రేప్

పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

loader