Asianet News TeluguAsianet News Telugu

టీచర్ రేప్, పరారీ: గర్బం దాల్చిన ఏడో తరగతి విద్యార్థిని

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. 30 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Kerala Class 7 Student Pregnant, Teacher Accused Of Rape
Author
Malappuram, First Published Aug 25, 2019, 8:00 PM IST

మలప్పురం: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. 30 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటు చేసుకుంది.

మెడికల్ చెకప్ కోసం బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బాలికపై దాదాపు రెండు నెలల పాటు ఉపాధ్యాయుడు అథ్యాచారం చేసినట్లు భావిస్తున్నారు. ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియదని అంటున్నారు. 

కౌన్సెలింగ్ నిర్వహించడంతో బాలిక తనపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన విషయాన్ని వెల్లడించింది. పరారీలో ఉన్న ఉపాధ్యాయుడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios