న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ను కేంద్రం ముక్కలు చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. సోమవారం నాడు క్షణాల్లోనే  ఈ ప్రక్రియ పూర్తైంది. లడఖ్‌పై పూర్తి అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటుంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేసింది.  జమ్మూ కాశ్మీర్, లడఖ్ లను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ తరహాలోనే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. లడఖ్ మాత్రం చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది.

 కాశ్మీర్ కు 370 ఆర్టికల్ ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక అధికారాలు ఉండేవి.  కేంద్రం తీసుకొన్న నిర్ణయం కారణంగా ప్రత్యేక అధికారాలు రద్దు చేయబడతాయి.దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్‌పై కేంద్రం తన అధికారాలను ప్రయోగించే అవకాశం ఉంది.

370 ఆర్టికల్ ద్వారా రాష్ట్రంలో కేంద్రం నేరుగా అధికారాలను ప్రయోగించే అవకాశం ఉండదు. రాష్ట్రం నుండి సిఫారసుల ఆధారంగానే కేంద్రం వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక నుండి ఆ పరిస్థితులు ఉండవు.

. లడఖ్ మాత్రమే ప్రత్యేకంగా ఉండనుంది. లడఖ్‌పై లెఫ్టినెంట్ గవర్నర్‌కే పూర్తి అధికారాలు ఉంటాయి. శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉంటాయి.

సంబంధిత వార్తలు

స్వయం ప్రతిపత్తి రద్దు: మూడు ముక్కలైన కాశ్మీర్, గెజిట్ విడుదల

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం