coronavirus: భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం..37 వేల‌కు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..

Coronavirus: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ క‌ల్లోలం రేపుతున్న‌ది. రోజురోజుకూ కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. త‌గ 24 గంట‌ల్లో ఏకంగా 37 వేల‌కు పైగా క‌రోనా కేసులు వెలుగుచూడ‌గా.. ఒమిక్రాన్ కేసులు సైతం 1,892కు పెరిగాయి. దీంతో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై.. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. 
 

Indias Omicron tally jumps to 1,892 as 37,379 new Covid cases reported in 24 hours

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత దేశంలో కోవిడ్-19 కొత్త కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఒక్క‌రోజే 37 వేల‌కు పైగా క‌రోనా కొత్త కేసులు న‌మోదుకావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసులు 3,49,60,261 కు చేరాయి. క్రియాశీల కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా 11 వేల మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 రిక‌వ‌రీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల త‌ర్వాత అత్య‌ధికంగా ఒక‌రోజు కోవిడ్ కేసులు ఇవేన‌ని గ‌ణాకాంలు పేర్కొంటున్నాయి. 

Also Read: coronavirus: మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ మొద‌లు.. క‌రోనా పంజాతో స్కూల్స్ క్లోజ్

అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,82,071 చేరింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.2 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.38 శాతంగా ఉంది. అయితే, క‌రోనా పాజిటివిటీ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వారంత‌పు పాజిటివిటీ రేటు 5.1 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన చ‌ర్య‌లు సైతం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌తో పాటు ప‌రీక్ష‌ల్లో వేగం పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 68,09,50,476 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. సోమ‌వారం ఒక్క‌రోజే 8,78,990 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సైతం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం నుంచి ప్ర‌భుత్వం 15 నుంచి 18 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న వారికి సైతం టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభించింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 146.3 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 61.4 కోట్ల‌కు పెరిగింది. మొద‌టి డోసు అందుకున్న వారు 84.9 కోట్ల మంది ఉన్నారు. 

Also Read: Omicron: ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. ఈ ఏడాది ముగిసే క‌ల్లా.. డ‌బ్ల్యూహెచ్‌వో కీల‌క వ్యాఖ్య‌లు !

దేశంలో కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే వెలుగుచూశాయి.  మహారాష్ట్ర 12,160 కొత్త కేసులు, పశ్చిమ బెంగాల్ 6,078, ఢిల్లీ 4,099 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలోని 8  రాష్ట్రాలు/UTలు ప్రతిరోజూ వేయి కంటే అధికంగా  కొత్త కేసులను నివేదిస్తున్నాయి. మ‌ర‌ణాల్లో అధికం కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. కొత్త‌గా అక్క‌డ 71 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత ప‌శ్చిమ  బెంగాల్ 13, మహారాష్ట్ర 11 మంది చ‌నిపోయారు. యాక్టివ్ కేసులు 32 రాష్ట్రాలు/UTలు పెరిగాయి. భారతదేశంలో గత 7 రోజులు మరియు మునుపటి 7 రోజులలో నివేదించబడిన కొత్త కేసుల మధ్య వ్యత్యాసం +238%  ఉంది. అయితే, ప్రపంచ సగటు +77% కంటే అధికంగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం.  టీనేజీ వాళ్ల‌కు టీకాలు పంపిణీ ప్రారంభించ‌గా.. 15-17 ఏళ్లలోపు వారిలో 42.06 లక్షల మంది సోమ‌వారం నాడు మొదటి డోస్‌ను స్వీకరించారు.  రోజువారీ  క‌రోనా పరీక్ష సానుకూలత రేటు అత్య‌ధికంగా గోవా 26.43% ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ 19.59%, మిజోరం 15.66%, మహారాష్ట్ర 11.01% ఉంది. క‌రోనా ప‌రీక్ష‌ల వారం సగటు సానుకూల‌త రేటు మిజోరం 13.88%, పశ్చిమ బెంగాల్ 10.39%, గోవా 9.46 శాతంగా ఉంది. 

Also Read: Governor Satya Pal Malik: ప్రధాని మోడీ పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios