Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. ఈ ఏడాది ముగిసే క‌ల్లా.. డ‌బ్ల్యూహెచ్‌వో కీల‌క వ్యాఖ్య‌లు !

Omicron: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ప్రతి దేశంలోనూ ఓమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త్వ‌ర‌లో అన్ని దేశాల‌పైనా క‌రోనా పంజా విసురుతుంద‌నీ, అయితే, ఈ ఏడాది చివ‌రి నాటికి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ముగిసిపోతుంద‌నే ఆశాభావాన్ని సైతం వ్య‌క్తం చేసింది. 
 

Amid global surge WHO chief says we can end Covid 19 pandemic in 2022
Author
Hyderabad, First Published Jan 4, 2022, 8:51 AM IST

Omicron: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త్వ‌ర‌లో అన్ని దేశాల‌పైనా క‌రోనా పంజా విసురుతుంద‌నీ, అయితే, ఈ ఏడాది చివ‌రి నాటికి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ముగిసిపోతుంద‌నే ఆశాభావాన్ని సైతం వ్య‌క్తం చేసింది. ప‌లు దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. మ‌రికొన్ని దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. 2022 చివ‌రినాటికి ముగుస్తుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే, దీనికి ముందుతు ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న అస‌మాన‌త‌ల‌ను దూరం చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌నీ, అలాగైతేనే క‌రోనాను తరిమికొట్ట‌గ‌ల‌మ‌ని చెప్పారు. 

Also Read: Governor Satya Pal Malik: ప్రధాని మోడీ పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పెరుగుతున్న క‌రోనా కేసుల మధ్య వ్యాక్సిన్ల అంశాల‌ను ప్ర‌స్తావించిన World Health Organisation చీఫ్.. సంకుచిత జాతీయవాదం, మ‌రికొన్ని దేశాల వ్యాక్సిన్ విధానాలు  వీటి స‌ర‌ఫ‌రాను బలహీనపరిచాయనీ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావానికి అనువైన పరిస్థితులను సృష్టించాయని అన్నారు. "ఎక్కువ కాలం అసమానత కొనసాగుతుంది, ఈ వైరస్ యొక్క ప్రమాదాలు మనం నిరోధించలేని లేదా అంచనా వేయలేని మార్గాల్లో అభివృద్ధి చెందుతాయి" అని ఘెబ్రేయేసస్ చెప్పారు. ప్రపంచం క‌రోనా మహమ్మారి మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు , "మనం దీనిని ముగించే సంవత్సరం ఇది అవుతుందని నేను విశ్వసిస్తున్నాను, అయితే మనం కలిసి చేస్తే మాత్రమే ఇది జ‌రుగుతుంది. అయితే, ప్ర‌స్తుతం నెల‌కొన్న అస‌మాన‌తలు ఆరోగ్య సంరక్షణలో దశాబ్దాల పురోగతికి ఇది ముప్పులా మారుతోంది. మిలియన్ల మంది ప్రజలు సాధారణ టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కోసం సేవలు, సంక్రమించే మరియు నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల చికిత్స స‌హా ఇత‌ర వైద్య సేవ‌ల‌కు దూర‌మ‌య్యారు" అని ఆయన అన్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై ఘెబ్రేయేస‌స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. COVID-19 ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ వ్యాప్తి కార‌ణంగా "సునామీలా" కేసులు పెరుగుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఏడాదిలో ప్రపంచం ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కేవలం కొవిడ్ కాదని, ఇంకా చాలానే ఉన్నాయని మరో బాంబ్ పేల్చారు టెడ్రోస్.

Also Read: Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా

గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో ఆందోళ‌న‌క‌ర స్థాయిలో విజృంభిస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాతో పాటు అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి యూర‌ప్ దేశాలో క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో అత్యంత ప్రమాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. "ఇదివ‌ర‌కు డెల్టా వేరియంట్ విజృంభించిన మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసిరే అవ‌కాశం అధికంగా ఉంది. ఈ రెండింటి కార‌ణంగా క‌రోనా సునామీ రావ‌చ్చు. ఇది ప్ర‌పంచంపై తీవ్ర ఒత్తిడిని క‌లుగ‌జేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది" అని ఘెబ్రేయేస‌స్ అన్నారు. 2022లో ప్రపంచ ప్రజలు ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కోవిడ్-19 మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు . ప్రతి చోటా, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి WHO ప్రపంచవ్యాప్తంగా పని చేస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

Also Read: భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య.. రెండు శవాలు !

Follow Us:
Download App:
  • android
  • ios