Asianet News TeluguAsianet News Telugu

Governor Satya Pal Malik: ప్రధాని మోడీ పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Governor Satya Pal Malik: గ‌త కొంత కాలంగా రైతులకు మ‌ద్ద‌తుగా నిల‌చిన మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ సారి ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ ఒక అహంకారిగా మాట్లాడారంటూ వ్యాఖ్యానించారు. 
 

Did 500 Farmers Die For Me, an Arrogant Modi Asked Me, Says Meghalaya Governor Malik
Author
Hyderabad, First Published Jan 3, 2022, 2:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

governor Satya Pal Malik: గ‌త కొంత కాలంగా రైతులకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ సారి ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ ఒక అహంకారిగా మాట్లాడారంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్ర‌ధానికి మ‌తిపోయింద‌ని వ్యాఖ్యానించిన‌ట్లు ఆరోపించారు. ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వివ‌రాల్లోకెళ్తే..  మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాలిక్ ఆదివారం నాడు హ‌ర్యానాలోని దాద్రిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన‌ ఆయ‌న‌.. ‘ఇటీవ‌ల రైతుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు నేను ప్ర‌ధానిని క‌లిశాను. ఈ సంద‌ర్భంగా కేవ‌లం ఐదు నిమిషాల్లోనే ప్ర‌ధానిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. చాలా అహంకారం ప్ర‌ద‌ర్శించారు. మ‌న రైతులు దాదాపు 500 మంది చ‌నిపోయారు అని నేను ప్ర‌స్తావిస్తుండ‌గానే.. ‘వాళ్లు నాకోసం చ‌నిపోయారా..?’ అంటూ ప్ర‌ధాని స్వ‌రం పెంచారు’ అని వెల్ల‌డించారు. 

Also Read: Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా

ప్ర‌ధాని మోడీ అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ..  ‘వాళ్లు నాకోసం చ‌నిపోయారా..?’ అని ప్ర‌శ్న‌కు  తాను అవును అని స‌మాధానం చెప్పాన‌ని మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యాపాలిక్‌ మాలిక్ పేర్కొన్నారు. మీరు రాజు కాబ‌ట్టి రైతుల మ‌ర‌ణాల‌కు మీరే బాధ్యుల‌ని చెప్పాన‌ని తెలిపారు. త‌ర్వాత ప్ర‌ధాని త‌నకు హోంమంత్రి అమిత్‌షాను క‌లిసి మాట్లాడ‌మ‌ని చెప్పార‌ని వెల్ల‌డించారు. ప్ర‌ధాని చెప్పిన‌ట్టుగానే తాను అమిత్ షాను క‌లిశాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా ప్ర‌ధానిని ఉద్దేశించి ‘స‌త్యా ఆయ‌న‌కు మతి త‌ప్పింది’ అని వ్యాఖ్యానించిన‌ట్లు ఆరోపించారు. కుక్క చ‌చ్చినా సంతాప లేఖ పంపే ప్ర‌ధాని రైతుల మ‌ర‌ణాల‌పై స్పందించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక ప్ర‌ధానితో పోరాటానికి స్వ‌స్తి ప‌లుకుతున్నాన‌ని అన్నారు. కాగా, ఇటీవ‌లి కాలంలో  రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు మాలిక్‌. వ్యవసాయ చట్టాలపై మాలిక్ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు దాడి చేశారు . నవంబర్‌లో జైపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల డిమాండ్‌లకు కేంద్రం అంగీకరించక తప్పదని అన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడిన ప్రతిసారీ ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వస్తుందేమోనని రెండు వారాలుగా భయాందోళనకు గురవుతున్నానని కూడా అన్నారు. గవర్నర్‌ను తొలగించడం సాధ్యం కాదని పేర్కొంటూ, ఆయన తొలగింపుకు దారితీసే ఏదైనా చెప్పడానికి "శ్రేయోభిలాషులు" వేచి ఉంటారని అన్నారు.

Also Read: భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య.. రెండు శవాలు !

రైతు ఉద్య‌మం గురించి మాట్లాడుతూ.. "ఈ ఆందోళన ముగిసిందని ప్రభుత్వం భావిస్తే త‌ప్పే..   ఆందోళన సస్పెండ్ చేయబడింది. రైతులకు అన్యాయం, దౌర్జన్యం జరిగితే మళ్లీ మళ్లీ ప్రారంభమవుతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను వారితో (రైతులకు) అండగా ఉంటాను"  అని మాలిక్ స్ప‌ష్టం చేశారు. ఇదిలావుండ‌గా,  స‌త్య‌పాల్ మాలిక్ ప్ర‌సంగాన్ని కాంగ్రెస్ పార్టీ బాగానే క్యాష్ చేసుకుంటున్న‌ది. ఆ ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్ట‌ర్‌లోనూ  పోస్టుచేసింది. మోడీజీ ఇది నిజ‌మేనా అని ఆ పోస్టుకు క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ రాజ్య‌స‌భాప‌క్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే సైతం ప్ర‌ధానిపై అమిత్ షా వ్యాఖ్య‌ల గురించి స‌త్య‌పాల్ మాలిక్ చెప్పిన‌ వీడియోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. రాజ్యంగ‌బ‌ద్ధ ప‌ద‌వుల్లో ఉన్న‌వాళ్ల మ‌ధ్య ఇలాంటి చ‌ర్చ జ‌రుగొచ్చా అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇక మ‌రికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మాలిక్ వ్యాఖ్య‌లు బీజేపీకీ కాస్త ప్ర‌తికూలమయ్యే అవకాశం లేక‌పోలేదు.

Also Read: coronavirus: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కొత్త కేసులు..

 

Follow Us:
Download App:
  • android
  • ios