Asianet News TeluguAsianet News Telugu

coronavirus: మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ మొద‌లు.. క‌రోనా పంజాతో స్కూల్స్ క్లోజ్

Coronavirus: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నిత్యం ప‌దుల సంఖ్య‌లో న‌మోదుకావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దీని ప్ర‌భావం అధికంగా ఉన్న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో జ‌న‌వ‌రి 31 వరకు  పాఠ‌శాల‌ల‌ను మూసివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 
 

Schools in Maharashtra will be closed till January 31, 2022 amid Omicron cases surge
Author
Hyderabad, First Published Jan 4, 2022, 9:27 AM IST

Coronavirus: ద‌క్షిణాఫ్రికాలో గత న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వెలుగుచూసిన దేశాల్లో సాధార‌ణ క‌రోనా కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. భార‌త్ లోనూ గ‌రిష్ట సంఖ్య‌లో క‌రోనా కొత్త‌కేసులు న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు అన్ని రాష్ట్రాల‌కు క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్త‌రించింది. మ‌హారాష్ట్రలో దీని ప్ర‌భావం మ‌రింత అధికంగా ఉంది. దేశ  ఆర్థిక రాజధాని ముంబ‌యిలో దీని నిత్యం ప‌దులు సంఖ్య‌లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌గా.. స్థానికంగా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.  ఇప్ప‌టికే  మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం పెరుగుతున్న నేప‌థ్యంలో.. పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ముంబ‌యి మ‌హా నగ‌రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల పెరుగుద‌ల కార‌ణంగా  పాఠశాలను జనవరి 31వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: Omicron: ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. ఈ ఏడాది ముగిసే క‌ల్లా.. డ‌బ్ల్యూహెచ్‌వో కీల‌క వ్యాఖ్య‌లు !

బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ జారీ చేసిన ఆదేశాల్లో మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఈ నెలాఖ‌రు (జ‌న‌వ‌రి 31) వ‌ర‌కు పాఠ‌శాల‌లు మూసివేయ‌బ‌డ‌తాయి. అయితే, ఒకటి నుంచి 9వ తరగతులకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు కొనసాగుతాయని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు రాష్ట్రంలో వివ‌రీతంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఓ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. స్కూళ్ల మూసివేత నిర్ణ‌యం రాష్ట్ర వ్యాప్తం చేసే అవ‌కాశాలు సైతం ఉన్నాయ‌న్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త క‌రోనా కేసులు పెర‌గ‌డంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం ప‌దుల సంఖ్య న‌మోద‌వుతున్నాయ‌ని అన్నారు.

Also Read: Governor Satya Pal Malik: ప్రధాని మోడీ పై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌రోనా వైర‌స్ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ త‌న ప్ర‌భావం పెంచుకుంటున్న‌ది. కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసులు రికార్డు స్థాయిలో మ‌ళ్లీ న‌మోదుకావ‌డానికి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు సైతం కార‌ణ‌మ‌య్యాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గోవాలో జ‌రిగిన కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో వేలాది మంది క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో అక్క‌డ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే గోవా సర్కారు మ‌రిన్ని ఆంక్ష‌లు విధించింది. ఒమిక్రాన్ టెన్ష‌న్ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ సైతం లాక్ డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు విధించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్ లు, బ్యూటీ పార్లర్ లు, జూపార్క్ లు మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి H. K. Dwivedi నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ద్వివేది. 

Also Read: Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా

Follow Us:
Download App:
  • android
  • ios