న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ తాను తన దుస్తులను తానే ఉతుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.సన్యాసి జీవితాన్నే తాను ఇష్టపడతానని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడు సినీ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేశారు. సుదీర్ఘకాలం పాటు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసునని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల ప్రధానమంత్రిగా తనకు  కలిసివచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.దేవేగౌడ కూడ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా  పనిచేశారని చెప్పారు. కానీ, ఆయన తక్కువ  కాలం పాటు మాత్రమే కర్ణాటకకు సీఎంగా కొనసాగారని ఆయన చెప్పారు.

అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన బరాక్ ఒబామా తాను జ్యోక్స్ వేసుకొనే వాళ్లమని ఆయన గుర్తు చేసుకొన్నారు. తామిద్దరం కలుసుకొన్న సమయంలో  ఎక్కువ సేపు నిద్ర పోవాలని ఒబామా తనకు సూచించారని చెప్పారు. 

అయితే తన శరీరం తక్కువ కాలం పాటు నిద్రపోయేందుకు అలవాటైందన్నారు. తాను కేవలం మూడున్నర గంటల పాటు మాత్రమే నిద్రపోతానని ఆయన చెప్పారు. రిటైరైన తర్వాత ఎక్కువ సేపు నిద్రపోయేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.

తాను పనిచేస్తూ అందరితో పనిచేయిస్తుంటానని ఆయన చెప్పారు. అధికారులందరికీ తాను ఓ స్నేహితుడినేనని ఆయన చెప్పారు.కష్టపడి జీవిందచడమే మన దేశ సంస్కృతని ఆయన చెప్పారు. నేను మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోనని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

నాకు చిల్లిగవ్వ కూడ లేదు: మోడీ

ఖాళీ సమయాల్లో టీ తాగుతా: మోడీ

సినిమాలు చూడలేకపోతున్నా: అక్షయ్ కుమార్‌తో మోడీ

అమ్మ నాకు డబ్బులిస్తోంది: నరేంద్ర మోడీ

మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ

ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ