న్యూఢిల్లీ: 32 ఏళ్లుగా తన బ్యాంకు ఖాతాలో చిల్లి గవ్వ లేదని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

బుధవారం నాడు  సినీ నటుడు అక్షయ్ కుమార్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. తాను స్కూల్‌లో చదువుకొనే సమయంలో డేనా బ్యాంకులో బ్యాంకు ఖాతాను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.  కానీ, ఆ  ఖాతాలో ఒక్క పైసా కూడ జమ చేయలేదన్నారు.

 

 

అయితే తనను గుర్తించిన డేనా బ్యాంకు సిబ్బంది ఈ ఖాతాలో డబ్బు లేనందున ఈ ఖాతాను మూసివేయాలని కోరినట్టుగా ఆయన చెప్పారని  ఆయన గుర్తు చేశారు. 30 ఏళ్ల వరకు తన బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవన్నారు.

మరో వైపు తాను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత  ఈ బ్యాంకు ఖాతాలోనే తన నెలవారీ వేతనాన్ని జమ చేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. తన ఖాతా నుండి సుమారు రూ.21 లక్షలను అవసరమైన వారి కోసం  ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. 

ఎమ్మెల్యేగా  తనకు సబ్సడీ ధరపై వచ్చిన భూమిని కూడ ఇతరులకు ఇచ్చానని ఆయన తెలిపారు.తనతో సమావేశాల్లో పాల్గొనేవారు మొబైల్ ఫోన్లను వాడరని చెప్పారు.  తాను కూడ సమావేశాల్లో ఉన్న సమయంలో  మొబైల్‌ను వాడనని చెప్పారు.

 

సంబంధిత వార్తలు

ఖాళీ సమయాల్లో టీ తాగుతా: మోడీ

సినిమాలు చూడలేకపోతున్నా: అక్షయ్ కుమార్‌తో మోడీ

అమ్మ నాకు డబ్బులిస్తోంది: నరేంద్ర మోడీ

మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ

ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ