న్యూఢిల్లీ: తన స్నేహితులతో తాను సరదాగా ఉండేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటానని  మోడీ చెప్పారు. విపక్ష పార్టీల్లో కూడ తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని మోడీ గుర్తు చేసుకొన్నారు.

 

బుధవారం నాడు సినీ నటుడు హీరో అక్షయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ నేత మమత బెనర్జీ కూడ తనకు మంచి మిత్రులని ఆయన చెప్పారు. అయితే ఇది ఎన్నికల సమయమని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా మమత తనకు గిఫ్ట్‌లు పంపిస్తుందని ఆయన ప్రస్తావించారు.

బంగ్లాదేష్ ప్రధానమంత్రి షేక్ హసీనా తనకు స్వీట్లు పంపేదాని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.తాను చిన్నతనం నుండి క్రమశిక్షణతో ఉండడం అలవాటు చేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.  అంతేకాదు అదే సమయంలో హాస్యం కూడ తన జీవితంలో భాగంగా మారిందన్నారు. తాను యవ్వనంలో ఉన్న సమయంలో జ్యోక్స్ ద్వారా మిత్రుల మధ్య వాతావరణాన్ని చల్లబరిచేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు.  

సంబంధిత వార్తలు

ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ