తాను ప్రధాని కావాలని ఏనాడూ కలగనలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనేది తనకు చిన్నప్పుడు కోర్కె ఉండేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.
న్యూఢిల్లీ: తాను ప్రధాని కావాలని ఏనాడూ కలగనలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనేది తనకు చిన్నప్పుడు కోర్కె ఉండేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.
బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను చెప్పారు.
సైనికుల నుండి తాను స్పూర్తిని పొందినట్టుగా ఆయన చెప్పారు. ఈ కారణంగానే తాను రామకృష్ణ మిషన్‌లో చేరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.రామకృష్ణ మిషన్‌తో అసోసియేట్ అయిన సభ్యులతో తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు.తనకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రామకృష్ణ మిషన్‌లో దొరికాయని ఆయన చెప్పారు.
తనకు ఏనాడూ కూడ కోపం రాలేదన్నారు. కోపం అనేది మానవ జీవితంలో భాగమన్నారు. అయితే కోపం అనేది మనిషిలో నెగిటివ్ భావోద్వేగాలను వ్యాప్తి చేస్తోందని ఆయన చెప్పారు.
ఏదైనా సమావేశంలో కోపంగా ఉంటే అది ఆ సమావేశంలో ప్రతి ఒక్కరిని ఆకర్షించనుందని ఆయన అభిప్రాయపడ్డారు.తాను తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటానని మోదీ తెలిపారు.
తాను కఠినంగా ఉంటానని కానీ ఎవ్వరిని అవమానించనని పేర్కొన్నారు. ఒత్తిడిలో పనిచేయడం అలవాటు చేసుకున్నానన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నానని మోదీ చెప్పారు.
