న్యూఢిల్లీ: సినిమాలు చూసేందుకు తనకు సమయం కుదరడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

బుధవారం నాడు  సినీ నటుడు అక్షయ్ కుమార్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  అమితాబచ్చన్ బలవంతంపై సినిమా చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

 

 

మరో వైపు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌తో కలిసి ఏ వెడ్నస్ డే  అనే సినిమాను చూసినట్టుగా ఆయన చెప్పారు.కానీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తనకు సినిమాలు చూసేందుకు మాత్రం తీరిక దొరకడం లేదని మోడీ చెప్పారు.గాంధీతో తాను స్పూర్తిని పొందినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.  

శుభ్రత, స్వచ్ఛత, టూరిజం ప్రమోషన్  వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దేశంలో సుమారు 9 కోట్ల  టాయిలెట్ల నిర్మాణం  దేశం సాధించిన లక్ష్యమని... ఇది తన ఒక్కడి వల్ల సాధ్యం కాలేదని మోడీ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అమ్మ నాకు డబ్బులిస్తోంది: నరేంద్ర మోడీ

మిత్రులతో ఇప్పటికి సరదాగానే ఉంటా: మోడీ

ఆర్మీలో చేరాలని ఉండేది: అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూలో మోడీ