Asianet News TeluguAsianet News Telugu

దోషులను స‌న్మానించ‌డం అసహ్యంగా ఉంది - బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ విచారణకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి

బిల్కిస్ బానో కేసులో దోషులకు సన్మానం చేయడం, స్వాగతం పలకడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో తీర్పు ఇచ్చిన రిటైర్డ్ జడ్జీ కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 

Honoring the guilty is disgusting - Judge presiding over Bilkis Bano gang-rape trial
Author
First Published Aug 24, 2022, 12:07 PM IST

శిక్షను రద్దు చేయడం ప్రభుత్వ అధికార పరిధిలోనిదే అయినా బిల్కిస్ బానో కేసులో దోషులను కొందరు వ్యక్తులు సన్మానించడం అసహ్యంగా ఉందని 14 ఏళ్ల క్రితం వారిని దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి అన్నారు. ముంబాయిలో ‘‘యునైటెడ్ అగైనెస్ట్ జస్టిస్ అండ్ డిస్క్రిమినేష‌న్’’ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ‘సాలిడారిటీ విత్ బిల్కిస్ బానో’ అనే కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి UD సాల్వి మాట్లాడారు. ‘‘నేను (వారిని దోషులుగా నిర్ధారించడంలో) ప్రత్యేకంగా ఏమీ చేశానని నేను అనుకోను. నా తీర్పు నా విధి" అని అన్నారు.

‘‘ ఉపశమనాన్ని మంజూరు చేసే హక్కు రాష్ట్రానికి ఉంది. ఇది చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వబడిన అధికారం’’ అని ఆయన అన్నారు. దోషుల విడుదలకు సంబంధించిన నివేదికలను తాను చూడలేదని, కాబట్టి ముందస్తు విడుదల చేయాలనే నిర్ణయంపై తాను వ్యాఖ్యానించ‌లేన‌ని అన్నారు. కానీ దోషుల సన్మానం (కొంతమంది వ్యక్తులు) పూర్తిగా చెడు ఉద్దేశంతో ఉంది. దోషులు కూడా స్వయంగా సన్మానాన్ని అంగీకరించకూడదు అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు సాల్వి స‌మాధానం ఇచ్చారు. చాలా కాలం కింద‌ట తాను ఇచ్చిన తీర్పును చ‌ద‌వాల‌ని ఉంద‌ని, కానీ ఇప్పుడు అది అందుబాటులో లేదు అని ఆయ‌న అన్నారు. 

అవివాహితపై ఐదేళ్లుగా నకిలీ బాబా అత్యాచారం... వీడియో తీసి బ్లాక్ మెయిల్..

2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆగ్రహానికి దారితీసింది. దోషులు విడుద‌ల అయిన త‌రువాత స్థానికులు వారిని స‌న్మానించినట్టు వీడియోలు, ఫోటోలు బ‌య‌టు వ‌చ్చాయి. వీటిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసేందుకు అనుమతించడంతో 11 మంది ఖైదీలు గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా.. బిల్కిస్ బానో కేసులో జ‌స్టిస్ సాల్వి అధ్యక్ష సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జనవరి 21, 2008న నిందితులకు జీవిత ఖైదు విధించింది.

ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగులబెట్టి 59 మంది కరసేవకులు హత్యకు గురికావడంతో హింస చెలరేగింది. ఈ స‌మ‌యంలో ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో, తన పసిపిల్లల కుమార్తె, 15 మందితో కలిసి తన గ్రామం నుండి పారిపోయారు. మార్చి 3వ తేదీన 20-30 మంది గుంపు వారిపై దాడి చేశారు. ఈ స‌మ‌యంలో బానోపై సామూహిక అత్యాచారం జరగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. దోషులు శిక్ష అనుభ‌విస్తున్న స‌మ‌యంలో ఒకరు త‌మ‌కు రిమిష‌న్ మంజూరు చేయాల‌ని న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం వారిని విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వానికి కోర్టు అనుమ‌తి ఇచ్చింది. 

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషుల ఘ‌న స్వాగ‌తం తప్పు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

కాగా.. గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేయ‌డంపై సుప్రీంకోర్టులు ప‌లు పిటిష‌న్లు దాఖ‌లు అయ్యింది. సంచలనం సృష్టించిన గోద్రా అనంతర అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న దోషులకు శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది అపర్ణా భట్‌లు చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘‘మేము రిమిషన్‌ను మాత్రమే సవాలు చేస్తున్నాం, సుప్రీం కోర్ట్ ఆర్డర్ కాదు. సుప్రీం కోర్ట్ ఆర్డర్ బాగానే ఉంది. రిమిషన్ మంజూరు చేసిన సూత్రాలనే సవాలు చేస్తున్నాము ’’ అని పిల్‌పై అత్యవసర విచారణను కోరుతూ సిబల్ అన్నారు.

సీపీఐ (ఎం) నాయకురాలు సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాల్, కార్యకర్త రూప్ రేఖా రాణి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే ఇలాంటి దారుణ‌మైన కేసుల్లో గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇచ్చిన రిమిష‌న్ అంశం చర్చకు దారితీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios