రోజూ రాత్రిపూట ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏమౌతుంది..?
పూజ సమయంలో... కచ్చితంగా దేవుడికి కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు. మరి.. ఈ కర్పూరాన్ని రోజూ రాత్రిపూట ఇంట్లో వెలిగిస్తే ఏం జరుగుతుందో జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
కర్పూరానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం, జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా... కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా కర్పూరాన్నివెలిగించడం వల్ల.. శుభం జరుగుతుందని నమ్ముతారు.
ఇక కర్పూరం నుంచి సువాసన కారణంగా.. ప్రతికూల శక్తులన్నీ దూరమైపోతాయని కూడా జోతిష్యశాస్త్రం ప్రకారం నమ్ముతారు. దానికోసమే పూజ సమయంలో... కచ్చితంగా దేవుడికి కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు. మరి.. ఈ కర్పూరాన్ని రోజూ రాత్రిపూట ఇంట్లో వెలిగిస్తే ఏం జరుగుతుందో జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
camphor
రాత్రిపూట ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందట. అందుకే... ఉదయం పూట కంటే రాత్రిపూట ఇంట్లో కర్పూరం వెలిగించాలట. కర్పూరం కి చాలా ఎక్కువ పాజిటివ్ శక్తి ఉంటుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి... ఇంటిలోపల పాజిటివీటిని పెంచుతుంది. అంతేకాకుండా.. ఇంట్లో ప్రశాంతతను కూడా పెంచుతుంది.
camphor image
కర్పూరంని ఎప్పుడైనా నిటారుగా కాల్చాలట. ఇలా కాల్చి.. ఆ పొగ ఇంటి మొత్తం వ్యాపించేలా.. ఇంట్లోని కుటుంబ సభ్యులకూడా ఆ పొగ తగిలేలా చూడాలి. అప్పుడు... కుటుంబం, కుటుంబ సభ్యులు ఎవరి మీద అయినా చెడు దృష్టి ఉంటే.. అది మొత్తం తొలగిపోతుందట.
మనం ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో డబ్బు, బంగారం దాచుకుంటాం కదా... ఆ ప్రదేశానికి కూడా రాత్రిపూట కర్పూరం కాల్చి.. ఆ పొగ తగిలేలా చేయాలి. అప్పుడు.. సంపద రావడంలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. పేదరికం తొలగిపోతుంది. అప్పులు తగ్గిపోతాయి. అదనప్పు ఖర్చులు కూడా తగ్గిపోతాయట. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే.. ఉదయం పూజ చేసిన సమయంలో కంటే.. రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరం కాల్చడం ఉత్తమం.