Asianet News TeluguAsianet News Telugu

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషుల ఘ‌న స్వాగ‌తం తప్పు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

బిల్కిస్ బానో ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులు విడుదల అయిన తరువాత వారికి ఘన స్వాగతం లభించడం తప్పే అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను తాను సమర్థించబోనని చెప్పారు. 

Bilkis Bano's warm welcome to gang rape convicts is wrong.. Maharashtra Deputy CM Devendra Fadnavis
Author
First Published Aug 24, 2022, 10:37 AM IST

బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులు జైలు నుంచి విడుదలైన తర్వాత వారికి ఘన స్వాగతం పలకడాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయ‌కుడు దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా విమర్శించారు. 11 మంది దోషులు గోద్రా జైలులో శిక్ష అనుభ‌విస్తుండ‌గానే స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్ ప్రభుత్వం వారిని విడుద‌ల చేసింది. అయితే వీరు విడుద‌ల అయిన త‌రువాత మిఠాయిలు పంచుతూ దండలతో వారికి ఘన స్వాగ‌తం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు ఓ  మితవాద గ్రూప్ విస్తృతంగా ప్రసారం చేయ‌డంతో తీవ్ర ఆగ్రహాం వ్య‌క్తం అయ్యింది.

భారీ వ‌ర్షాలు.. 18 రాష్ట్రాల‌కు ఐఎండీ హెచ్చ‌రిక‌లు

దోషుల సంబంరాల‌పై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేవేంద్ర ఫ‌డ్నవీస్ కూడా స్పందించారు. నిందితుల‌కు స‌న్మాన్ని స‌మ‌ర్థంచ‌లేమని, ఇది త‌ప్ప‌ని ఆయ‌న అన్నారు. ‘‘ 2002 నాటి గుజరాత్‌లోని బిల్కిస్ బానో కేసులో దోషులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. అయితే నేరానికి పాల్పడిన వ్యక్తిని సత్కరిస్తే అది కచ్చితంగా తప్పే. అలాంటి చర్యకు ఎలాంటి సమర్థనా ఉండదు ’’ అని ఫడ్నవిస్ అన్నారు.

వైరల్: ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషులకు ముంబైలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. తర్వాత బాంబే హైకోర్టు శిక్షను సమర్థించింది. దోషులలో ఒకరు ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిమిషన్ ను కోర్టు ఆమోదించింది. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్ ప్రభుత్వం 11 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది.గోద్రా జైలు నుంచి విడుదలైన అనంతరం ఖైదీలకు పూలమాలలు వేసి స్వీట్లతో స్వాగతం పలికారు.ఈ ఫోటో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 

అయితే రిమిషన్‌ను స‌వాల్ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, మాజీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెస‌ర్ రూపరేఖ వర్మ తరఫున మూడు పిటిషన్లు దాఖ‌లు అయ్యాయి. అయితే వీటిని సుప్రీంకోర్టు స్వీక‌రించింది. మినహాయింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పిటిషనర్ల తరఫు న్యాయ‌వాదులు వాదనలు వినిపించారు. 

ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు.. నితీష్ సర్కార్ బలపరీక్ష‌ వేళ బిహార్‌లో నాటకీయ పరిణామాలు

మార్చి 2002లో గోద్రాలోని సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి తర్వాత గుజ‌రాత్ రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. 59 మంది ‘కర సేవకులు’ మరణించినందున, ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో గుజరాత్‌లోని దాహోద్‌లో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. బిల్కిస్ బానో కుటుంబంలోని ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురు దారుణ హత్యకు గురయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios