హర్యానా: జమ్ముకశ్మీర్ విభజన అంశం కాంగ్రెస్ పార్టీకి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే అంశంలో కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొనడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. 

జమ్ముకశ్మీర్ అంశం ఆ పార్టీని ఓ కుదుపుకుదిపేసిన సంగతి తెలిసిందే. విభజన జరిగి రెండు వారాలు కావస్తున్నా దాని ప్రభావకం కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికీ కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్‌ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని తప్పకుండా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. 

దేశభక్తి, ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370రద్దు, ఆర్టికల్ 35ఏ రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గాడితప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు భూపేంద్ర సింగ్ హుడా. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ కి మరో ఝలక్: మోదీకి జై కొట్టిన జ్యోతిరాదిత్య సింధియా

 

కాంగ్రెస్ కు ఝలక్: ఆర్టికల్ 370 రద్దుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్