Asianet News TeluguAsianet News Telugu

అమ్మకానికి పెళ్లి కొడుకులు.. అమ్మాయిలకు వరుళ్లను విక్రయించే మార్కెట్ గురించి తెలుసా?

బిహార్‌లో పెళ్లి కొడుకులను అమ్మకానికి పెట్టే ఓ అంగడి ఉన్నది. రావి చెట్ల కింద నిర్వహించే మార్కెట్‌లో పెళ్లి కొడుకులు సంప్రదాయ లేదా జీన్స్ ప్యాంట్, షర్ట్‌లు వేసుకుని హాజరవుతారు. పెళ్లి కూతురు కుటుంబాలు వరుడిని సెలెక్ట్ చేసుకుంటాయి.
 

grooms for sale in bihars madhubani market bride selects grooms
Author
Patna, First Published Aug 10, 2022, 2:52 PM IST

పాట్నా: పెళ్లి కొడుకులను ఎక్కడైనా మార్కెట్‌లో కొనుక్కుంటామా? వరుళ్లను అమ్మాకినికి పెట్టే మార్కెట్ అంటూ ఉంటుందా? ఇదంతా తేడా వ్యవహారంలా ఉంది కదూ. ఏదో సినిమాలో పనికి వచ్చే కథలా ఉన్నది. కానీ, ఇది కథ కాదు యదార్థం. పెళ్లి కొడుకులను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టే అంగడి ఒకటి ఉన్నది. అది బిహార్‌లో ఉన్నది. ఈ మార్కెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

బిహార్ అంటే ఇప్పుడు నితీష్ కుమార్ రాజకీయమే కదా అని కొట్టిపారేయకండి. ఈ రాజకీయాలు ఒక వైపు నడుస్తుండగా... మరో వైపు ఆసక్తికర కథనం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బిహార్‌లోని మధుబని జిల్లాలో పెళ్లి కొడుకులను అమ్మకానికి పెట్టే మార్కెట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ అవుతున్నది.

మధుబనిలోని పెళ్లి కొడుకుల మార్కెట్ తొమ్మిది రోజులపాటు సాగుతుంది. పచ్చని రావి చెట్ల నీడ కింద ఈ సంత నిర్వహిస్తారు. పెళ్లి కొడుకులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటారు. లేదా జీన్స్, ప్యాంట్ ధరించి కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వారు తమ ఆస్తి, చదువు, అర్హతలు ధ్రువపరిచే డాక్యుమెంట్లను వెంట పెట్టుకుని తమని తాము అమ్ముకోవడానికి రెడీగా కూర్చుని ఉంటారు. తమ సంరక్షకులు, కుటుంబ సభ్యులతో ఆ పెళ్లి కొడుకులు వేలాది మంది ఆ అంగడికి కనిపిస్తారు. సౌరథ్ సభ అని పిలిచే ఈ మార్కెట్‌కు మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన కుటుంబీకులు వచ్చి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసుకుంటారు.

అమ్మాయి తరఫు కుటుంబాలు, తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకునే వారు ఆ సంతకు విచ్చేస్తారు. తమకు సరిపడా సంబంధం కోసం గాలిస్తారు. అమ్మాయి.. అబ్బాయిని ఎంచుకుంటే.. తదుపరి కార్యక్రమాలకు చర్చ ప్రారంభమవుతుంది. పెళ్లి కొడుకు ఎంపికవ్వగానే పెళ్లి పనులను వేగంగా పెళ్లి కూతురు కుటుంబం చేసుకుంటుంది. ఒక రకంగా ఇది ఆ‌ఫ్‌లైన్ మ్యాట్రిమోనిలో ఉన్నది.

స్థానికుల విశ్వాసాల ప్రకారం, కర్ణాత్ వంశ పాలకుల కాలంలో ఈ పద్ధతి పుట్టినట్టు చెబుతారు. రాజా హరి సింగ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు స్థానికులు భావిస్తున్నారు. వేర్వేరు గోత్రాల మధ్య పెళ్లిళ్లను ప్రోత్సహించేలా ఈ పద్ధతిని ఆయన అవలంబించినట్టు వివరిస్తున్నారు. మరో లక్ష్యం ఏమిటంటే.. వరకట్నాన్ని రూపుమాపడం. కానీ, ఈ పద్ధతిలోనూ వరకట్నం సమసిపోలేదు. ఈ పెళ్లిళ్లలను వరకట్నం సర్వసాధారణంగా ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios