Asianet News TeluguAsianet News Telugu

From the IAF Vault: భారత వైమానిక దళంలో యుద్ధ విమానం మిగ్ 21 పరిణామక్రమం

భారత వైమానిక దళ సుదీర్ఘ చరిత్రలో యుద్ధ విమానం మిగ్ 21 అసంఖ్యాక వేరియంట్లు సేవలు అందించాయి. ఔత్సాహికులకు మిగ్ 21 ఎన్నో ఆశ్చర్యకర, ఆసక్తికర విషయాలను ముందు ఉంచుతుంది. భారత వైమానిక దళ సేవల్లో మిగ్ 21 పరిణామ క్రమాన్ని ప్రముఖ ఐఏఎఫ్ చరిత్రకారుడు అంచిత్ గుప్తా అందిస్తున్నారు.
 

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history
Author
First Published Mar 3, 2023, 7:33 PM IST

భారత వైమానిక దళానికి ఉన్న దీర్ఘమైన చరిత్రలో మిగ్ 21 ప్రస్థానం ఎన్నో మజిలీలతో కూడుకుని ఉన్నది. అసంఖ్యాక వేరియంట్ల మిగ్ 21లను ఐఏఎఫ్ ఉపయోగించింది. తొలిసారి భారత వైమానిక దళం మిగ్ 21ఎఫ్, 13 టైప్ వేరియంట్ 74 ఫిష్‌బెడ్ సీని ఉపయోగించింది. 1963లో ఆరు విమానాలను కొనుగోలు చేయగా వాటిని 1968 వరకు వినియోగించారు. ఇది కే 13 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌ను మోసుకెళ్లగలదు. ఈ ఆరు యుద్ధ విమానాల సీరియల్ నెంబర్స్ బీసీ 816 నుంచి బీసీ 821గా ఉన్నాయి.

ఆర్ 11 ఇంజిన్‌తో నడిచే ఈ విమానాలకు పిటోట్ ట్యూబ్ ఇంజిన్ కింద ఉండేది. కానీ, ఆ తర్వాత వచ్చిన అన్ని టైప్‌లలో ఇంజిన్ పైన పిటోట్ ట్యూబ్ ఉంటుంది. కానీ, దీనికి రాడార్ లేదు. సింగిల్ షాట్ అనేది పెద్ద సమస్య. ఎక్కువ కాలం గాలిలో ఎగరలేదు.

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history

1965లో పీఎఫ్ వేరియంట్ ఆరు మిగ్ 21లను పొందింది. వీటి సీరియల్ నెంబర్ బీసీ 822 నుంచి బీసీ 827గా ఉన్నది. ఎక్కువ కాలం గాలిలో ఎగరడానికి ఉపకరించేలా ఆర్ 11 ఎఫ్2-300 ఇంజిన్ అమర్చారు. తొలిసారి ఆర్1ఎల్ అనే సెర్చ్ రాడార్‌ వచ్చింది. అయితే, ఈ టైప్ విమానాలు కేవలం మిస్సైల్స్ మాత్రమే మోసుకెళ్లుతాయి.మరే కెనాన్స్‌ను ఉపయోగించలేం. 1965 యుద్ధంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history

ఆ తర్వాత టైప్ 76లు ఆర్2ఎల్ రాడార్లతో మరికొంత బెటర్ ఇంజిన్‌లతో వచ్చాయి. వీటి సీరియల్ నెంబర్స్ బీసీకి బదులు సీగా వచ్చి నెంబర్ సిరీస్ అలాగే కంటిన్యూ అయింది. అయితే, ఎఫ్ 4 వేరియంట్ పురోగతినే సూచిస్తుంది. 

1966లో వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్ 21ఎఫ్ఎల్, టైప్ 77 వేరియంట్ ఎఫ్ఎల్‌ 38 విమానాలను యూఎస్ఎస్ఆర్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 38 విమానాలు అక్కడి నుంచి కొనుగోలు చేసుకోగా 197 విమానాలను హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ 1966 నుంచి 1973 కాలంలో తయారు చేసింది.

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history

ఈ విమానాలు ఎయిర్ టు గ్రౌండ్ పాత్ర కూడా పోషించాయి. 1967లో 500 కిలోల బాంబులను తిల్పత్ రేంజ్‌కు డెలివరీ చేశాయి. 1971లో బాంబు పేలుళ్లలో దీని పాత్ర కారణంగా వీటికి రన్ వే బస్టర్ అనే పేరు వచ్చింది. హెచ్ఏఎల్ పెద్ద సంఖ్యలో తయారు చేయడం కూడా ఈ టైప్ విమానాలతో ప్రారంభమైంది.

1975లో ఐఏఎఫ్ మిగ్ 21బీఐఎష్ టైప్ 75, ఫిష్ బెడ్ ఎన్ వేరియంట్లను కొనుగోలు చేసింది. ఇందులో ప్రధానమైన ఇంప్రూవ్‌మెంట్ ఏమిటంటే ఆర్ 25 ఇంజిన్, ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్, గన్ సైట్, బ్లైండ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రూమెంటేషన్‌లు ఉన్నాయి. 70 విమానాలను నేరుగా ఎగిరే స్థితిలో కొనుగోలు చేయగా.. 220 విమానాలను 1978 నుంచి 1985 కాలంలో హెచ్ఏఎల్ తయారు చేసింది.

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history

చివరగా 2001లో బీఐఎస్‌లను బైసన్‌లుగా ఐఏఎఫ్ అప్‌గ్రేడ్ చేసింది. విజువల్ రేంజ్‌కు మించిన మిస్సైల్స్, కేఏబీ 500 టీవీ గైడెడ్ బాంబులు, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్, రాడార్ వార్నింగ్ రిసీవర్, కాక్ పిట్ వ్యూ అద్భుతంగా ఉండటం. ఈ విమానాల సీరియల్ నెంబర్లు సీయూ నుంచి సీకి మారిపోయాయి.

From the IAF Vault: evolution of MiG 21 fighter jets in indian air force history

ప్రతి టైపు విమానాలను ఎగర్చడానికి ట్రైనర్లు అవసరమవుతాయి. మిగ్ 21 యూ/యూఎం/యూఎస్ మంగోల్(టైప్ 66-400/66-600/68/69)ల టూ సీట్ ట్రైనర్ వర్షన్‌లు ఉన్నాయి. సుమారు 100 విమానాలను యూఎస్ఎస్ఆర్, తూర్పు యూరప్ దేశాల నుంచి వీటిని పొందగలిగాం. వీటిలో ఒక్కటి కూడా హెచ్ఏఎల్ తయారు చేయలేదు. సుమారు 850 ఎయిర్ క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసింది.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

Follow Us:
Download App:
  • android
  • ios